Meerpet Incident: Meerpet Incident: రంగారెడ్డికి జిల్లాకు చెందిన గురుమూర్తి భార్యను శవాన్ని కుక్కర్లో ఉడికించి కిరాతకంగా చంపిన కేసులో పోలీసులతో సంచలన విషయాలు బయటపెట్టాడు. అయితే మర్డర్ కి ముందు భార్య, పిల్లలతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వెళ్లినట్లు తెలిపాడు. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా మూవీ చూశారట. ఆ తర్వాత పిల్లలను అమ్మమ ఇంట్లో వదిలేసి.. భార్యతో కలిసి ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చిన భార్య తనతో గొడవ పెట్టుకుందని.. ఈ క్రమంలో కోపమొచ్చి భార్యను గోడకేసి కొట్టడంతో ఆమె చనిపోయింది. దీంతో ఎలాగైనా శవం మాయం చేయాలని ప్లాన్ చేసిన గురుమూర్తి సినిమా లెవెల్లో స్కెచ్ వేశాడు. భార్య శవాన్ని ముక్కలు చేసి.. కుక్కర్లో ఉడకబెట్టి.. ఎండబెట్టి పొడి చేసి చెరువులో కలిపేసినట్లు పోలీసులకు తెలిపాడు.
Also Read: CM Revanth: అల్లు అర్జున్ అరెస్ట్ పై మరోసారి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్!
దృశ్యం, సూక్ష్మదర్శిని సినిమాలను చూసి
అయితే గురుమూర్తి భార్యను ముక్కలుగా నరికే ముందు ప్రాక్టీస్ కోసం కుక్కను నరికి చంపినట్లు తెలుస్తోంది. అంతేకాదు దృశ్యం, సూక్ష్మదర్శిని వంటి మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను చూసి.. అదేవిధంగా ఏమాత్రం అనుమానం రాకుండా భార్య శవాన్ని మాయం చేసేందుకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. నిందితుడు గురుమూర్తి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 14న భార్యను చంపిన గురుమూర్తి ఆ తర్వాత మూడు రోజుల పాటు శవాన్ని మాయం చేసే ప్లాన్ లోనే ఉన్నాడు. ముందుగా ఇంట్లో ఉన్న రెండు కత్తులతో శరీరంలోని మెత్తటి భాగాలు అన్నీ కోసి వాటిని 6 గంటల పాటు వాటర్ హీటర్ ద్వారా బకెట్లో ఉడికించాడు. ఆ తర్వాత వాటిని ఎండబెట్టి.. రోలులో వేసి దంచి, పొడి చేశాడు. ఇంతటితో అతడి పైశాచికం ఆగలేదు. బోన్స్‌ను కూడా బూడిద అయ్యే వరకు కాల్చి.. ఆ బూడిద మొత్తాన్ని2 బకెట్లలో తీసుకెళ్ళి చెరువులో పడేశాడు.
Also Read: Rashmika Mandanna: ఇదే నా లాస్ట్ సినిమా.. రిటైర్మెంట్ పై రష్మిక సంచలన ప్రకటన