Constable's wife : నడిరోడ్డుపై భార్య రీల్..కానిస్టేబుల్ కు షాక్

"ఎంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' అంటే ఇదేనేమో. అవును భార్య చేసిన పనికి ఉద్యోగం పోగొట్టుకోవడం భర్త పనైంది. పంజాబ్, హర్యానా రాజధాని చండీగఢ్‌ ప్రాంతంలో నడిరోడ్డుపై రీల్స్ చేసి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించినందుకు కానిస్టేబుల్ అయిన భర్తను సస్పెండ్ చేశారు.

New Update
 Constable's wife

Constable's wife

Constable's wife :  "ఎంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అంటే ఇదేనేమో . అవును భార్య చేసిన పనికి ఉద్యోగం పోగొట్టు్‌కోవడం భర్త పనైంది. పంజాబ్, హర్యానా రాజధాని చండీగఢ్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన అందర్నీ ముక్కుమీదా వేలేసుకునేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే........

Also Read: Former Union Minster Girija Vyas:దేవుడి హారతి మంటలు అంటుకుని తీవ్ర గాయాలపాలైన మాజీ కేంద్ర మంత్రి

ఆమెపేరు జ్యోతి. పంజాబ్, హర్యానా రాజధాని చండీగఢ్‌కు చెందిన సీనియర్‌ కానిస్టేబుల్‌ అజయ్‌ కుందు భార్య. ఇక్కడి వరకు బాగనే ఉంది కానీ అసలు విషయానికొస్తే..మార్చి 20న వదిన పూజతో కలిసి జ్యోతి గుడికి వెళ్లింది. సాయంత్రం నాలుగున్నరకు వస్తుండగా.. ఏం బుద్ధి పుట్టిందో.. ఏమో తెలియదు గానీ.. ఉన్నట్టుండి సెక్టార్-20 గురుద్వారా చౌక్ దగ్గర జీబ్రా క్రాసింగ్‌‌పై రీల్స్ చేయడం మొదలు పెట్టింది. సిగ్నల్ దగ్గర ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. అయినా కూడా జ్యోతి డ్యాన్స్ చేస్తూనే ఉంది. ఒక ఫేమస్ పాట ప్లే అవుతుండగా ఆమె వదిన మొబైల్‌లో రికార్డ్ చేసింది. అక్కడితో ఆగకుండా ఇంటికెళ్లి అజయ్ కుందు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసింది. ఇది వైరల్‌గా మారింది.

Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!

ఈ విషయాన్ని హెడ్ కానిస్టేబుల్ జస్బీర్ చండీగఢ్‌లోని సెక్టార్ 34 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై సీరియస్ అయిన చండీగఢ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏఎస్‌ఐ బల్జిత్ సింగ్ నేతృత్వంలోని బృందం సెక్టార్ 20లోని గురుద్వారా చౌక్, సెక్టార్ 17లోని పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. రీల్స్ కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా గుర్తించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి నేరాల కింద ఇద్దరు మహిళలపై బీఎన్ఎస్ సెక్షన్లు 125, 292 మరియు 3(5) కింద కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా కానిస్టేబుల్ అజయ్ కుందును సస్పెండ్ చేశారు. జ్యోతి, పూజలకు వెంటనే బెయిల్ లభించింది.

Also Read: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!

అయితే అజయ్ కుందు సస్పెన్షన్‌పై మిశ్రమ స్పందనలు వెల్లువడ్డాయి. మహిళలు చేసిన తప్పుకి భర్తను బలి చేయడమేంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చాలా మంది ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇంకొకరు వినోదం కోసం అలా చేస్తే తప్పేంటి? అని అడిగారు. మరికొందరు నడిరోడ్డుపై ఇవేం పనులు అంటూ నిలదీశారు. ఇలా రకరకాలుగా నెటిజన్లు స్పందించారు.  

Also Read:  TG News: తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు వడగళ్ల వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!

Advertisment
తాజా కథనాలు