మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మాజీ RTO కానిస్టేబుల్ సౌరభ్ శర్మ నుంచి పెద్దమొత్తంలో ఆస్తులు బయటపడటం చర్చనీయమవుతోంది. నాలుగు రోజుల క్రితమే భోపాల్‌లో రోడ్డు పక్కన కారులో 52 కేజీల బంగారం, రూ.11 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నగదు, బంగారం మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మకు చెందినవేనని అధికారులు గుర్తించారు. అలాగే ఆయన ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో మరో రెండున్నర కోట్ల నగదును సీజ్ చేశారు. అలాగే 234 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. 2013 నుంచి 2015 వరకు సౌరభ్ శర్మ రవాణా శాఖలో ఆర్టీవో కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఉద్యోగంలో ఉండగానే తీవ్ర అవినీతికి పాల్పడ్డారు. అతడి వద్ద దాదాపు వంద కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు ప్రస్తుతం అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 19న రాత్రి మెండోరి అటవీ ప్రాంతంలో ఓ కారులో 52 కిలోల నగదు, రూ.11 కోట్ల నగదును ఐటీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం, నగదు మధ్యప్రదేశ్ నుంచి వేరే చోటుకి తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు 100 మంది వరకు పోలీసులు పాల్గొన్నారు. Also Read: యూపీలో దారుణం..పుట్టినరోజని పిలిచి బట్టలిప్పించి..మూత్రం తాగించారు #WATCH | Madhya Pradesh | Visual of the car from which the Bhopal Police and Income Tax seized 52 kg of gold and bundles of money The car was found abandoned in the jungle of Mendori in the Ratibad area. Police and Income Tax are trying to find out who left the money and gold… https://t.co/ZgT17Ubcce pic.twitter.com/fqhhzMSJMJ — ANI (@ANI) December 20, 2024 #WATCH | Madhya Pradesh | In a joint action by Bhopal Police and Income Tax, 52 kg of gold and bundles of money were found in an abandoned car in Bhopal during an IT raid. The car was found abandoned in the jungle of Mendori in the Ratibad area. Police and Income Tax are trying… pic.twitter.com/7KOoJ4AZBJ — ANI (@ANI) December 20, 2024 మరోవైపు ఈ కేసుకు సంబంధించి లోకయుక్త పోలీస్ డైరెక్టర్ జనరల్ జైదీప్ ప్రసాద్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' సౌరభ్ శర్మ తండ్రి ఆర్కే శర్మ ఒక ప్రభుత్వ వైద్యుడు. 2015లో ఆయన మరణించాడు. ఆ తర్వాత కారుణ్య నియామకం కింద 2015లో సౌరభ్ శర్మ రాష్ట్ర రవాణాశాఖలో కానిస్టేబుల్‌గా బాధ్యతలు స్వీకరించాడు. 2023లో ఇతడు స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. ఉద్యోగంలో ఉండా సౌరభ్ శర్మ భారీగా అవినీతికి పాల్పడ్డాడు. తన తల్లి, భార్య, మరదలు, సన్నిహితుల పేర్ల మీద పాఠశాల, హోటల్‌ను కూడా ఏర్పాటు చేశాడని'' జైదీప్ తెలిపారు.