/rtv/media/media_files/2025/04/19/j55sEn2Btb3Cxuq0W1vC.jpeg)
lady constable committed suicide
Constable Death: ఇటీవలే జనగామ జిల్లాలో పెళ్లి కావట్లేదని-- ఏఆర్ మహిళా కానిస్టేబుల్ నీలిమ సూసైడ్ చేసుకున్న ఘటన మరవకముందే మరో లేడీ కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకుంది. వరంగల్ జిల్లా కాజీపేట దర్గా ప్రాంతానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అర్చన 2022లో వివాహం చేసుకుంది. అయితే ఈమెకు పెళ్లి మూడునాళ్ళ ముచ్చటగా ముగిసింది. పెళ్ళైన కొద్దిరోజులకే భర్తతో విడాకులు అయ్యాయి. ఆ తర్వాత అర్చన ఉద్యోగానికి కొన్నిరోజులు సెలవు పెట్టి మరో పోటీ పరీక్షలకు సిద్దమవడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో డిప్రెషన్ లోకి వెళ్లిన అర్చన.. జీవితంపై విరక్తి చెంది దారుణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకొని చనిపోయింది.
Also Read: Life Style: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!
వరంగల్లో మరో కానిస్టేబుల్ సూసైడ్
— The Bharat (@TheBharat_News) April 19, 2025
వరంగల్ జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. కాజీపేటలో అర్చన అనే మహిళా కానిస్టేబుల్ చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2022లో వివాహం, ఆపై విడాకుల కారణంగా ఆమె మానసిక వేదనతో బాధపడుతోంది. కొద్ది రోజుల క్రితమే పెళ్లి కావడం లేదని నీలిమ అనే మరో… pic.twitter.com/HQhah26ob8
పెళ్లి కావట్లేదని మరో కానిస్టేబుల్
మరోవైపు జనగామ జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ నీలిమ పెళ్లి సంబంధం కుదరడం లేదని మనస్థాపం చెంది ఉరేసుకొని చనిపోయింది. నీలిమ 2020లో తన పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. నీలిమ ఉద్యోగంలో చేరినప్పటినుంచి ఎంతో క్రమశిక్షణగా పనిచేస్తూ, అందరితో స్నేహంగా ఉండేంది. అయితే ఆదివారం రోజు తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కొడకండ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
latest-news | telugu-news | warangal
Also Read: Jagamerigina Satyam: తెలంగాణ మట్టి వాసనను గుర్తుచేసేలా మరో సినిమా.. రవితేజ మేనల్లుడు హీరోగా!