కానిస్టేబుల్‌ కాదు కామాంధుడు.. కేసు పెట్టడానికి వస్తే గర్భవతిని చేసి

ఓ కేసు విషయంలో డబ్బులు వచ్చేలా చూడాలంటూ మేడ్చల్‌ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ స్థానిక మహిళ(31)తో పరిచయం పెంచుకున్నాడు కానిస్టేబుల్‌ సుధాకర్‌రెడ్డి. మాయమాటలు చెప్పి న్యాయం చేస్తానని చెప్పి గర్భవతిని చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో  విషయం వెలుగులోకి వచ్చింది.  

New Update
onstable Sudhakar Reddy

onstable Sudhakar Reddy

మేడ్చల్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఓ కేసు విషయంలో డబ్బులు వచ్చేలా చూడాలంటూ మేడ్చల్‌ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ స్థానిక మహిళ(31)తో పరిచయం పెంచుకున్నాడు కానిస్టేబుల్‌ సుధాకర్‌రెడ్డి. మాయమాటలు చెప్పి తన వలలో వేసుకున్నాడు.  ఆమెకు  న్యాయం చేస్తానని చెప్పి చివరికి గర్భవతిని చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో  విషయం వెలుగులోకి వచ్చింది.  

మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతని వద్దకు గతేడాది మార్చి 21వ తేదీన ఓ మహిళ డబ్బుల విషయంలో తనని కొందరు ఇబ్బంది పెడుతున్నారని తనకు ఆ డబ్బులు వచ్చేలా చూడాలంటూ మహిళ ఫిర్యాదు చేసింది. అయితే ఆమె నెంబర్ తీసుకున్న  సుధాకర్ రెడ్డి మెల్లిగా పరిచయం పెంచుకున్నాడు.  న్యాయం చేస్తానని నమ్మించి మహిళను ఇంటికి రప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి  అత్యాచారం చేశాడు.

 అమ్మానాన్నలకు పరిచయం చేస్తానని చెప్పి

మరోసారి ఇలాగే ఇంట్లో తన అమ్మానాన్నలకు పరిచయం చేస్తానని చెప్పి ఇంటికి పిలిపించుకున్నాడు.  పెళ్లి విషయం మాట్లాడుదామని భార్యలేని టైమ్ లో ఇంటికి రప్పించి ఇలా పలుసార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో మహిళ గర్భవతి  అయింది. దీంతో తనను కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందేనని మహిళ సుధాకర్ పై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టింది. 

దీంతో ఆమె అబార్షన్‌కు ఒత్తిడి చేసి మందులు మింగించాడు సుధాకర్ . అంతేకాకుండా తన  భార్య సింధూజ, స్నేహితుడు  కళ్యాణ్‌గౌడ్‌తో కలిసి ఆమెపై దాడి చేయించాడు.  దీంతో బాధితురాలు  కానిస్టేబుల్ సుధాకర్ పై సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో గురువారం సుధాకర్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. అతనికి సహకరించిన సింధూజ, కళ్యాణ్‌గౌడ్‌లపై కేసు నమోదు చేశారు పోలీసులు.  

Also Read :  అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా రూ.35 లక్షల విలువ గల గుడ్లు దొంగతనం!

Also Read :  నేడు పోలీసుల విచారణకు హాజరుకానున్న ఆర్జీవీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు