Komatireddy : ఛీ..ఛీ.. నేనలా అనలేదు.. హోంశాఖపై కోమటిరెడ్డి ట్వీట్!
హోంశాఖ అంటే తనకు ఇష్టమని అన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తనకు హోంశాఖ అయితే బాగుంటుందని తన అభిమానులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లుగా మీడియాతో చెప్పాను అంతే కానీ తనకు హోంశాఖ కావాలని కోరలేదన్నారు.
Uttam Kumar Reddy: అధిష్ఠానంపై అలిగిన ఉత్తమ్.. మంత్రి పదవి బిస్కెట్
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్ఠానంపై అలిగినట్లు తెలుస్తోంది. తన భార్య పద్మావతికి మంత్రి అడగగా.. దీనికి హైకమాండ్ ఒప్పుకోలేదు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రాహుల్‌గాంధీతో సమావేశం జరగగా.. 20 నిమిషాల్లోనే ఆయన బయటికొచ్చారు.
Parliament: ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంట్లో గందరగోళం.. రాజ్యాంగంపై నడ్డా సంచలన కామెంట్స్!
కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ల అంశంపై సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై జేపీ నడ్డా మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ముక్కలు ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.
Minister Seethakka-Padi Koushik Reddy: తమ్ముడూ మా ఇంటికి భోజనానికి రండి అంటూ పాడి కౌశిక్ రెడ్డిని ఆహ్వానించిన సీతక్క!
రైతు రుణమాఫీ, బోనస్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాడి కౌశిక్ రెడ్డికి సమాధానం ఇస్తూ.. మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. తన జీవన విధానం వేరని.. కౌశిక్ లైఫ్ స్టైల్ వేరంటూ చురకలంటించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తన ఇంటికి భోజనానికి రావాలన్నారు.
KCR: ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ సన్నాసి.. కేసీఆర్ సంచలన కామెంట్స్
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. ఏపీలో కూటమి లేకపోతే చంద్రబాబు అధికారంలోకి వచ్చే వారు కాదన్నారు. ఆనాడు తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Defector MLAs : సీఎం రేవంత్‌కు జంపింగ్ ఎమ్మెల్యేల షాక్... అంతా తూచ్...మేం పార్టీ మారలేదు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. ఉపఎన్నికలు ఖాయమని కేసీఆర్, కేటీఆర్ అంటున్నారు. అయితే తాము పార్టీ ఫిరాయించలేదని మర్యాదపూర్వకంగా సీఎంను కలిశామంటున్నారు ఎమ్మెల్యేలు.
Rahul Gandhi : ఈసీ ప్రతిపాదనతో మా వాదనకు మద్దతు..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఎన్నికలసంఘం(ఈసీ) ప్రతిపాదన బలం చేకూరుస్తోందని అభిప్రాయపడ్డారు.
Revanth Reddy : రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రిని.. చిట్‌చాట్‌లో CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని.. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలి వాయిదా పడిన తర్వాత శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు.