/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 15న బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. 17న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేయనన్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి ఖరారైనట్లు తెలుస్తోంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.
షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 22న సమర్పించిన పత్రాల పరిశీలన చేయనున్నారు. అక్టోబర్ 24 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే తేదీగా నిర్ణయించారు. అదే రోజున సాయంత్రం ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేస్తారు. నవంబర్ 14న యూసఫ్‌గూడలో ఓట్లు లెక్కించి తుది ఫలితాలు విడుదల చేయనున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల#JubileeHillsByElection#Telangana#RTVpic.twitter.com/j6qRROZT72
— RTV (@RTVnewsnetwork) October 13, 2025
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,98,982 మంది ఓటర్లున్నారు. వీళ్లలో 2,07,367 మంది పురుషులు, 1,91,590 మంది స్త్రీలు ఉన్నారు మరో 25 మంది ఇతరులు ఉన్నారు. ఈ ఉప ఎన్నికలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ గట్టిగా ఫోకస్ పెట్టాయి. ఈ ఉపఎన్నికల్లో గెలిచే పార్టీకే ప్రజల్లో ఆదరణ పెరుగుతోందనే భావన వస్తుందని నమ్ముతున్నారు. అందుకే ఈ ఉప ఎన్నికలను మూడు పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి.