KTR : మంచినీళ్ల ట్యాంక్ లో కోతి కళేబరాలు..ట్విట్ చేసిన కేటీఆర్!
నందికొండ వాటర్ ట్యాంక్‌లో వానరాల కళేబరాలు వెలుగుచూసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. తెలంగాణ మున్సిపల్ శాఖ సిగ్గుపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
నందికొండ వాటర్ ట్యాంక్‌లో వానరాల కళేబరాలు వెలుగుచూసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. తెలంగాణ మున్సిపల్ శాఖ సిగ్గుపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
తెలంగాణలో కరవుకు కాంగ్రెసే కారణమన్నారు కిషన్‌రెడ్డి. కరువుతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. సాగు తాగు నీటి ఎద్దడి మొదలైందని.. పశువులకు తాగునీరు దొరకని పరిస్థితి వచ్చిందన్నారు. కరవు నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడుతారో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో న్యాయ విచారణ కోసం కేంద్ర సాయం కోరితే సహకరిస్తామన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
100 రోజుల పాలన పై ప్రగతి నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ప్రగతి నివేదికలో మహాలక్ష్మి పథకం , ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, గ్యాస్ సిలిండర్ రాయితీ వంటి కార్యక్రమాలతో కలిపి మొత్తం 5 హామీలను అమలు చేశామని పేర్కొంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలనం నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది. త్వరలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్యశ్రీ పథకం ఇవ్వడమే ఈపథకం ముఖ్య ఉద్దేశ్యం.
BRS ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదో చెబితే విని ట్రాప్‌లో పడొద్దని హెచ్చరించారు. మీరు మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు.
మీరు తెలంగాణలో ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్నారా? అయితే మరి రేషన్ కార్డు కోసం కేవైసీ చేయించారా? లేదా? చేయకపోతే వెంటనే చేయించుకోండి. లేదంటే మీ రేషన్ కార్డు రద్దయ్యే ప్రమాదం ఉంది.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆరునెలల్లో ప్రజలు తిరగబడక తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.