Kalyanalaxmi Scheme: కల్యాణలక్ష్మి కింద తులం బంగారం.. గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7 తర్వాత పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి స్కీమ్ కింద రూ.లక్షతో పాటు తులం బంగారం అందిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రకటించారు. అయితే.. తమకు కూడా ఇలానే ఇవ్వాలని ఇప్పటికే దరఖాస్తు చేసుకుని సాయం పొందని వారు కోరుతున్నారు.