Kishan Reddy: తెలంగాణలో కరవు.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి ఆగ్రహం! తెలంగాణలో కరవుకు కాంగ్రెసే కారణమన్నారు కిషన్రెడ్డి. కరువుతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. సాగు తాగు నీటి ఎద్దడి మొదలైందని.. పశువులకు తాగునీరు దొరకని పరిస్థితి వచ్చిందన్నారు. కరవు నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడుతారో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. By Vijaya Nimma 01 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kishan Reddy: బీజేపీ కిసాన్ మోర్చా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లకు అభ్యర్థులు దొరకడం లేదని వ్యాఖ్యానించారు. టికెట్లు ఇచ్చిన పోటీ చేయమని వెనక్కి తగ్గుతున్నారని అన్నారు. మోదీకి (PM Modi) వ్యతిరేకంగా పోటీ చేయాలంటే భయపడుతున్నారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్రెడ్డి అన్నారు. బాయిల్డ్ రైస్ కొనాలని మోదీని కోరితే ఓకే చెప్పారు. ఈనెల ఒకటి నుంచి తెలంగాణలో ధాన్యం కొనుగోలను కేంద్రము ప్రారంభిస్తుందని కిషన్రెడ్డి అన్నారు. బోనస్ ఇవ్వాలని డిమాండ్: రైతులను (Farmers) గత ప్రభుత్వం మోసం చేసింది.. అదే బాటలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) నడుస్తుందని కిషన్రెడ్డి ఫైర్ అయ్యారు. ధాన్యంకి బోనస్ ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ఆయన్ ప్రశ్నించారు. 70 లక్షల టన్నుల ధాన్యం కొంటామని కేంద్రానికి ఈ ప్రభుత్వం చెప్పింది.. ప్రతి క్వింటాల్కి 500 బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎకరానికి రూ. 15వేలు రైతు భరోసా ఇవ్వాటంతోపాటు కౌలు రైతులను ఆదుకోవాలని కిషన్రెడ్డి కోరారు. కరువుతో పంటలు ఎండిపోతున్నాయి వెంటనే సర్కార్ స్పందించాలన్నారు. ఎలాంటి కరువు సహాయక చర్యలు తీసుకుంటారు..? రాష్ట్రంలో ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని ధ్వజమెత్తారు.సాగు తాగు నీటి ఎద్దడి మొదలైంది. పశువులకు తాగునీరు దొరకని పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు నుంచి ప్రజలను ఏ విధంగా గట్టు ఎక్కిస్తారో, ఎలాంటి కరువు సహాయక చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం చెప్పాలని కిషన్రెడ్డి కోరారు. బీజేపీ రైతులకు అండగా ఉంటుంది. రైతులు సంక్షేమంగా ఉండాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలన్నారు. తెలంగాణలో 17కు 17 సీట్లు బీజేపీ గెలుస్తుందని కిషన్రెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: మండలి వర్సెస్ జనసేన.. అవనిగడ్డలో రాజుకున్న నిప్పు! #telangana #congress-government #telangana-drought #kishan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి