Tamilnadu: నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాము- స్టాలిన్
కేంద్రం బడ్జెట్లో తమిళనాడుకు అన్యాయం చేసిందని, దీనికి నిరసనగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోడీపై స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటే ఒంటరి అవుతారని హెచ్చరించారు.