Actor Ajith: పద్మభూషణ్ తర్వాత.. గాయాలపాలైన అజిత్..! ఏం జరిగిందంటే
పద్మభూషణ్ తీసుకున్న తర్వాత అజిత్ మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకోగా.. ఆయనను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో అక్కడ గందరగోళం ఏర్పడి అజిత్ కాలికి గాయమైంది. దీంతో అయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.