This Week Movie: మూవీ లవర్స్ కి పండగే.. ఈ వారం థియేటర్, ఓటీటీలో అదిరిపోయే సినిమాలు!

ఈ వారం కొత్త సినిమాలతో పాటు రీ రిలీజ్ సినిమాలు కూడా థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. సింగిల్, శుభం, కలియుగం, బ్లైండ్ స్పాట్ సినిమాలు ఈ వారం విడుదల కానున్నాయి. వీటితో పాటు మెగాస్టార్ ఆల్ టైమ్ క్లాసిక్ జగదేకవీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ కానుంది.

New Update
this week ott theater movies

this week ott theater movies

This Week Movie: గత వారం విడుదలైన నాని హిట్ 3, సూర్య రెట్రో సినిమాల సందడి ఇంకా కొనసాగుతుండగానే.. ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. కొత్త సినిమాలతో పాటు రీ రిలీజ్ సినిమాలు కూడా మరోసారి వెండితెరపై మెరవనున్నాయి. ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదల కానున్న సినిమాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

థియేటర్ సినిమాలు 

శుభం

స్టార్ నటి సమంత నిర్మాతగా రూపొందిన తొలి చిత్రం శుభం ఈ వారం 9న విడుదల కానుంది. ఇటీవలే మూవీ ట్రైలర్ విడుదల చేయగా సస్పెన్స్, కామెడీ ఎలిమెంట్స్ తో సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇందులో సామ్ కూడా స్పెషల్ రోల్లో కనిపించడం ఆసక్తికరంగా మారింది. 

సింగిల్

హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్. ఈ చిత్రం కూడా  మే 9న విడుదల కానుంది. అల్లు అరవింద్ నిర్మాణంలో కార్తీక్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

కలియుగం  

శ్రద్ధ శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కలియుగం 2064'.  సైంటిఫిక్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ఆర్. కే ఇంటర్నేషనల్, ప్రైమ్ సినిమాస్ బ్యానర్ పై ప్రమోద్ సుందర్ ఈ మూవీని తెరకెక్కించారు. 

బ్లైండ్ స్పాట్

నవీన్ చంద్ర, రాశి సింగ్, అలీ రెజా, రవి వర్మ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'బ్లైండ్ స్పాట్'. ఈ చిత్రం కూడా మే 9న థియేటర్స్ లో విడుదల కానుంది. రాకేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 

జగదేకవీరుడు అతిలోక సుందరి

మెగాస్టార్ చిరంజీవి- శ్రీదేవి జంటగా నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ 'జగదేకవీరుడు అతిలోక సుందరి'. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ చిత్రం మరో వెండితెరపై సందడి చేయనుంది. మే 9న గ్రాండ్ రీ రిలీజ్ ప్లాన్ చేశారు. మెగా ఫ్యాన్స్ తో సహా సినీ ప్రియులు సైతం ఈ మూవీని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఓటీటీ సినిమాలు 

  • గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ:  మే 08 (నెట్ ఫ్లిక్స్)
  • ది మ్యాచ్‌:  మే 7 (నెట్ ఫ్లిక్స్)
  • లాస్ట్‌ బుల్లెట్‌:   మే 7 (నెట్ ఫ్లిక్స్)
  • రాబిన్హుడ్ : మే 10 (జీ 5)
  • అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి: మే8 (ఈటీవీ విన్)

cinema-news | latest-news | this-week-ott-releases

Also Read: HIT 3 BOX Office Collections: 100 కోట్ల క్లబ్ చేరువలో అర్జున్ సర్కార్ వేట.. మూడో రోజు ఎంత వసూలు చేసిందంటే..!

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Manchu Brothers: అంతా మనోజే చేయించాడు..కన్నప్ప హార్డ్ డ్రైవ్ విషయంలో విష్ణు సంచలన కామెంట్స్

టాలీవుడ్ లో ప్రస్తుతం కన్నప్ప హార్డ్ డ్రైవ్ దొంగతనం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో మళ్ళీ అన్నదమ్ములు ఇద్దరూ కొట్టుకుంటున్నారు. ఆ హార్డ్ డ్రైవ్ మనోజ్ ఇంట్లో పని చేసే రఘు, చరిత అనే వాళ్ళే కొట్టేశారని మంచు విష్ణు ఆరోపిస్తున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
manchu vishnu about Prabhas

manchu vishnu about Prabhas

కన్నప్ప సినిమా విడుదలకు ముందే సమస్యల్లో చిక్కుకుంది. దీనికి సంబంధించి హార్డ్ డ్రైవ్ దొంగతనం అవడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.  ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి డీటీడీసీ కొరియర్ ద్వారా హైదరాబాద్‌లోని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కార్యాలయానికి పంపిన హార్డ్ డ్రైవ్ ఆఫీస్ బాయ్ రఘు ద్వారా చరిత అనే యువతికి అప్పగించారు. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయింది. దీనిపై 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ రెడ్డి ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ముదురుతున్న అన్నదమ్ముల గొడవ..

దీనిపై తాజాగా మంచు విష్ణు కూడా స్పందించారు. హార్డ్ డ్రైవ్ దొంగతనం వెనుక తన సోదరుడు మంచు మనోజ్ హస్తం ఉందని ఆరోపించారు. రఘు, మనోజ్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నాడని, చరిత కూడా మనోజ్ ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తి అని అన్నారు.  45 రోజుల క్రితం హైవ్ స్టూడియోస్ నుంచి వచ్చిన హార్డ్ డ్రైవ్ పార్శిల్‌ను విష్ణు ఇంటి సెక్యూరిటీ తీసుకోకుండా మనోజ్ సిబ్బంది అడ్డుకున్నారని..ఇప్పుడు కూడా ఇది వాళ్ళ నే అని మంచు విష్ణు అన్నారు. ఇప్పటికే చాలా వివాదాలతో మంచు కుటుంబం రోడ్డు మీదకు వచ్చింది. ఇప్పడు హార్డ్ డ్రైవ్ గొడవతో ఈ గొడవలు మరింత ముదిరిందని అంటున్నారు. 

మరోవైపు మనోజ్ భైరవం ఫంక్షన్ లో మనోజ్ కూడా హార్డ్ డ్రైవ్ గురించి మాట్లాడడం సంచలనం సృష్టించింది.  చరితకు మనోజ్ థాంక్స్ చెప్పారు. ఆమె చాలా గొప్ప ని చేసిందని..జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పారు. తన అన్నకు చరిత చేసిన మేలు మరువరానిది అంటూ మాట్లాడారు. ఇప్పుడు మంచు విష్ణు కూడా ఆమె గురించే మాట్లాడడంతో మొత్తం హార్డ్ డ్రైవ్ వ్యవహారం అంతా ఆమె చుట్టూతానే తిరుగుతోంది అని తెలుస్తోంది. ఆమెను మధ్యలో పెట్టుకుని అన్నదమ్ముల గొడవ మరింత పెరిగేలా కనిపిస్తోంది. 

 

Also Read: Student Visas: వీసా స్లాట్లను రోజూ చెక్ చేసుకోండి..విద్యార్థులకు అమెరికా సూచన

Advertisment
Advertisment