Ram Charan: నాని 'హిట్3' పై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. డైరెక్టర్ ని అలా అంటూ..

రామ్ చరణ్.. నాని 'హిట్ 3' మూవీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ప్రత్యేకమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ వరుస బ్లాక్ బస్టర్స్ స్కోర్ చేస్తున్న నా ప్రియమైన సోదరుడు నానికి అభినందనలు. ఈ ఇంటెన్స్ కథను అందించిన శైలేష్ కి హ్యాట్సాఫ్ అని ట్వీట్ చేశారు.

New Update

Ram Charan:  శైలేష్ కొలను దర్శకత్వంలో విడుదలైన నాని 'హిట్ 3' సూపర్ హిట్ రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కొనసాగిస్తోంది. ప్రేక్షకులతో పాటు విమర్శకులు, సినీ ప్రియులు ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా 'హిట్ 3' ని అభినందిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. 

రామ్ చరణ్ ట్వీట్ 

'హిట్ 3' గురించి అద్భుతమైన రివ్యూలు వింటున్నాను. విభిన్నమైన స్కిప్టులను ఎంచుకుంటూ అన్ని జోనర్ లలో  బ్లాక్‌బస్టర్‌లను సాధించిన నా ప్రియమైన సోదరుడు నానికి నా ప్రత్యేక అభినందనలు. ఈ ఇంటెన్స్ చిత్రానికి  స్క్రిప్ట్ రాసి, అమలు చేసినందుకు  డైరెక్టర్ శైలేష్ కొలనుకి  హ్యాపీస్ ఆఫ్. అలాగే నటి శ్రీనిధి శెట్టి, హిట్ 3 మొత్తం చిత్రబృందానికి అభినందనలు అని తెలియజేశారు. 

cinema-news

Also Read: HIT 3 BOX Office Collections: 100 కోట్ల క్లబ్ చేరువలో అర్జున్ సర్కార్ వేట.. మూడో రోజు ఎంత వసూలు చేసిందంటే..!

Advertisment
తాజా కథనాలు