Dil Raju AI Studio: 'Lorven AI Studio'.. నిర్మాణ రంగంలో దిల్ రాజు వినూత్న అడుగు!

నిర్మాత దిల్ రాజు AI స్టూడియోను ప్రారంభించారు. శనివారం జరిగిన ఈప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. 'Lorven AI Studio' పేరుతో AI స్టూడియోను లాంచ్ చేశారు. AI చిత్రనిర్మాణంలోకి అడుగుపెట్టిన తొలినిర్మాతగా దిల్ రాజు సంచలనం సృష్టించారు.

New Update

Dil Raju AI Studio: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, టెక్నాలజీ కంపెనీ క్వాంటం AIతో కలిసి, ఒక వినూత్నమైన అడుగు వేశారు. హైదరాబాద్ లో తొలి  AI ఆధారిత క్రియేటివ్ స్టూడియోని ప్రారంభించారు. Lorven AI Studio పేరుతో దీనిని లాంచ్ చేశారు. సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి కొత్తదనం తీసుకువచ్చే ప్రయత్నమే ఈ స్టూడియో. Lorven AI Studio  మొత్తం నాలుగు AI ఆధారిత టూల్స్‌ను ప్రారంభించింది. సినీ స్క్రైబ్, సినీ స్కెచ్, పిచ్ క్రాఫ్ట్, సినీ ఫ్లో. తెలుగు చిత్రపరిశ్రమలో  AI చిత్రనిర్మాణంలోకి అడుగుపెట్టిన తొలినిర్మాతగా సంచలనం సృష్టించారు దిల్ రాజు. 

మంత్రి శ్రీధర్ బాబు చీఫ్ గెస్ట్ 

ఈ ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా కంపెనీని లాంచ్ చేయించారు దిల్ రాజు. అనంతరం  నిర్మాత అల్లు అరవింద్ స్టూడియో లోగోను ఆవిష్కరించారు. “Lorven లోగో ను  లార్డ్ వెంకటేశ్వర స్వామిని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించినట్లు తెలిపారు. ఇందులోని ‘E’ అక్షరం ఎనర్జీ, ఉత్సాహం, విజ్ఞానం అనే అర్థాలను కలిగి ఉంటుందని చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “AI అనేది లక్షల మంది మేధస్సులు కలిసి పనిచేసే శక్తి. అలాంటిది  దిల్ రాజు టెక్నాలజీతో క్రియేటివిటీని కలిపారు. ఈ ప్రయత్నంతో తెలంగాణ రాష్ట్రం హాలీవుడ్, బాలీవుడ్  సినిమాలతో  పోటీ చేయగల స్థాయికి వస్తుంది” అని అన్నారు.

తక్కువ బడ్జెట్.. బెస్ట్ అవుట్ పుట్.. 

అలాగే  నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, “రెండు సంవత్సరాల క్రితమే AI..  సినిమాల్లో విప్లవాత్మక మార్పులు తేగలదని గ్రహించాము. మా 25  అనుభవంతో స్క్రిప్టింగ్ నుంచి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఉపయోగపడే టూల్స్‌ని అభివృద్ధి చేయడానికి  Quantum AIతో కలిసి పనిచేశాము.   “AI ఒక First Assistant Directorలా పని చేస్తుంది. 

dil raju AI Studio Lorven launch event
dil raju AI Studio Lorven launch event

AI టూల్స్ సినిమాను ముందుగానే విజువలైజ్ చేయడానికి, ప్రీ-ప్రొడక్షన్లో సమయం ఆదా చేయడానికి, అలాగే ఖర్చు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. దీని ద్వారా సినిమా సక్సెస్ రేట్ పెరుగుతుందని ఆశిస్తున్నాము అని తెలిపారు దిల్ రాజు.  ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు..  దర్శకులు కె. రాఘవేంద్రరావు,  వి.వి. వినాయక్,  సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్,  వేణు శ్రీరాం, బాబీ,  వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, సుకుమార్ తదితరులు హాజరయ్యారు. 

telugu-news | latest-news | cinema-news | telugu-cinema-news 

Advertisment
Advertisment
తాజా కథనాలు