Crime News: 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు.!

చిత్తూరు జిల్లా పాకాల మండలంలో పదేళ్ళ క్రితం 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కట్టమంచి బుజ్జి అనే నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించింది. ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్ళి.. ఆమెకు మద్యం తాగించి అత్యాచారం చేశాడు.

New Update
Court

Court

Crime News:  ఆలస్యమైన తప్పు చేసినవాడు శిక్ష అనుభవించడం ఖాయమని ఊరికే చెప్పలేదు. 10 ఏళ్ల క్రితం 7 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి సుప్రీం కోర్టు జీవిత ఖైదు విధిస్తు తీర్పునిచ్చింది.  కట్టమంచి బుజ్జి అనే నిందితుడు పదేళ్ల క్రితం చిత్తూరు జిల్లా పాకాల మండలంలో ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్ళి.. ఆమెకు మద్యం తాగించి అతి కిరాతకంగా అత్యాచారానికి ఒడిగట్టాడు.  అయితే 2015లో జరిగిన ఈ ఘటనపై చిత్తూరు జడ్జీ విచారణ జరిపి నిందితుడు బుజ్జికి యావజ్జీవ శిక్ష విధించింది. 

Also Read: Vishnu Prasad: ఇండస్ట్రీలో విషాదం.. లివర్ వ్యాధితో ప్రముఖ బుల్లితెర నటుడు కన్నుమూత!

తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో 

కాగా,  2016లో న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ బుజ్జి ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. కానీ అక్కడ కూడా ఇతడి వాదనలు చెల్లలేదు.  హైకోర్టు కూడా జిల్లా కోర్టు తీర్పును సమర్థిస్తూ 2024 జులై 24న అదే తీర్పును ఇచ్చింది. దీంతో బుజ్జి ఆ తీర్పును సవాలు చేస్తూ మళ్ళీ సుప్రీం కోర్టులో A Special Leave Petition (SLP) పిటీషన్ వేశాడు. 

Also Read: HIT 3 BOX Office Collections: 100 కోట్ల క్లబ్ చేరువలో అర్జున్ సర్కార్ వేట.. మూడో రోజు ఎంత వసూలు చేసిందంటే..!

సుప్రీం కోర్టు యావజ్జీవ శిక్ష 

అయితే తాజాగా ఈ పిటీషన్ పరిశీలించిన న్యాయస్థానం.. దీనిని కొట్టివేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునే అవసరం కనిపించలేదని స్పష్టం చేసింది. బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడు బుజ్జి పై క్సో చట్టంలోని సెక్షన్‌ 4, ఐపీసీ సెక్షన్‌ 376(1) కేసు నమోదైంది. 

cinema-news | latest-news

Also Read: Dil Raju AI Studio: 'Lorven AI Studio'.. నిర్మాణ రంగంలో దిల్ రాజు వినూత్న అడుగు!

Advertisment
Advertisment
తాజా కథనాలు