Vishwambhara: మెగాస్టార్ హీరోయిన్ ఫస్ట్ లుక్.. 'అవని' గా త్రిష సందడి !

మెగాస్టార్ విశ్వంభర నుంచి నటి త్రిష ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో త్రిష 'అవని' అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

New Update
Vishwambhara update trisha first look

Vishwambhara update trisha first look

Vishwambhara: 'బింభిసార' ఫేమ్ వశిష్ఠ మల్లడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్  'విశ్వంభర'. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'రామ రామ' సాంగ్ విడుదల చేయగా సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ నుంచి త్రిష ఫస్ట్ లుక్ తో పాటు ఆమె పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. 

Also Read: HIT 3 BOX Office Collections: 100 కోట్ల క్లబ్ చేరువలో అర్జున్ సర్కార్ వేట.. మూడో రోజు ఎంత వసూలు చేసిందంటే..!

Also Read :  పాకిస్థాన్‌ గొంతు ఎండేలా భారత్‌ మరో సంచలన నిర్ణయం

త్రిష ఫస్ట్ లుక్ 

ఈ సినిమాలో త్రిష 'అవని' అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. సాంప్రదాయ చీరకట్టులో త్రిష లుక్ అద్భుతంగా కనిపించింది. 18 ఏళ్ళ తర్వాత త్రిష- చిరంజీవి ఈ సినిమాలో మరోసారి కలిసి సందడి చేయనున్నారు. స్టాలిన్ తర్వాత త్రిష- మెగాస్టార్ కాంబోలో వస్తున్న రెండవ సినిమా విశ్వంభర. దీంతో ఈ సినిమాలో చిరంజీవితో త్రిష ట్రాక్ ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. 

cinema-news | latest-news

Also Read: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)

Also Read :  అత్తాకోడళ్ల మధ్య డైలీ గొడవలా..  ఈ నియమాలు పాటించండి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు