/rtv/media/media_files/2025/05/05/1cRd4zTatR5h1V77QIEO.jpg)
allu Aravind visited hospital to look sree tej condition
అల్లు అర్జున్ 'పుష్ప2' ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన రేవతి కొడుకు శ్రీతేజ్ 5 నెలల చికిత్స తర్వాత ఇటీవలే కోమా నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత శ్రీతేజ్ ను కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం అక్కడే శ్రీతేజ్ కి ట్రీట్మెంట్ అందిస్తున్నారు వైద్యులు. శ్రీతేజ్ హాస్పిటల్ లో ఉన్నప్పటి నుంచి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు అల్లు అరవింద్, అల్లు అర్జున్.
అల్లు అరవింద్ పరామర్శ
ఈ క్రమంలో ఈరోజు ఉదయం అల్లు అరవింద్, బన్నీ వాసు మరోసారి శ్రీతేజ్ ను పరామర్శించారు. అక్కడ అల్లు అరవింద్ డాక్టర్లతో స్వయంగా మాట్లాడి శ్రీతేజ్ పరిస్థితి గురించి ఆరా తీశారు. రోజురోజుకూ మెదడు పనితీరు మెరుగవుతుందని డాక్టర్లు తెలిపారు. ఇలాంటి కేసుల్లో పెద్దవారు కోలుకోవడం కొంచెం కష్టం అవుతుంది.. కానీ శ్రీతేజ్ వయసు చిన్నది కావడం వల్ల క్రమంగా మెదడు పనితీరు మెరుగుపడుతుందని వెల్లడించారు. శ్రీ తేజ్ కోలుకుని.. మళ్లీ ఎప్పటిలానే మంచి జీవితం గడిపే వరకు అతడికి, అతడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఇప్పటికే అల్లు అర్జున్ భరోసా ఇచ్చారు. అంతేకాదు శ్రీతేజ్ పూర్తి వైద్యానికి అవసరమయ్యే ఖర్చులు కూడా తానే చూసుకుంటానని మాటిచ్చారు. అల్లు అర్జున్ తో పాటు పుష్ప 2 నిర్మాతలు, తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీతేజ్ వైద్యానికి ఆర్ధిక సహాయం అందించారు.
శ్రీతేజ్‌ను పరామర్శించిన నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు..
— Telangana Awaaz (@telanganaawaaz) May 5, 2025
ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్‌లో శ్రీతేజ్‌ను పరామర్శించిన నిర్మాతలు..
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న అల్లు అరవింద్, బన్నీ వాసు..
గతంలో సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఘటనలో గాయపడి… pic.twitter.com/y3EI3r6fg5
ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటనకు సంబంధించి అరెస్టైన అల్లు అర్జున్.. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. అల్లు అర్జున్ థియేటర్ కి రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని కేసు నమోదు చేయగా.. బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు.
sandya theater incident updates | revathi son sri teja | cinema-news | telugu-news