Pavan Kalyan: అటవీ భూముల ఆక్రమణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో రిలీజ్

చిత్తూరు జిల్లాలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమించారని ఆరోపిస్తూ డిప్యూటీ CM పవన్ వీడియో విడుదల చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఏరియల్ సర్వేలో తేలిందని ఆయన కార్యాలయం వెల్లడించింది.

New Update
pavan kalyan

Pavan Kalyan

Pavan Kalyan: చిత్తూరు జిల్లాలో(Chittoor-District) వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(MLA Peddireddy Ramachandra Reddy) అటవీ భూముల ఆక్రమించారని ఆరోపిస్తూ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వీడియో విడుదల చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఏరియల్ సర్వేలో తేలిందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. దీనితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధం ఉందని పేర్కొంది.

Also Read: మొత్తం విప్పేసి.. డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ హాట్ షో అందాలు.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

రెవెన్యూ రికార్డులను కూడా తారుమారు చేశారన్నారు. విజిలెన్స్‌ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్‌ ఆదేశించారు. ఆక్రమణ దారుల పేర్లు, కేసుల వివరాలను అటవీ శాఖ వెబ్‌సైట్‌లో పెట్టాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని Dy.CM పవన్ అధికారులను ఆదేశించారు. CM CBN, క్యాబినెట్‌కు ఆక్రమణల గురించి వివరించి సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు.

Also Read: Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ లో సంచలన విషయాలు..పేలుళ్లలో మహిళా ఉగ్రవాదుల పాత్ర

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన సమీక్షలో “అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయి?” అని ప్రశ్నించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అడవి మధ్యలో ఉన్న భూమిని వారసత్వ భూమిగా పేర్కొనడం పట్ల పవన్ కళ్యాణ్ ప్రశ్నలు లేవనెత్తారు. భూమి అసలు సర్వే నంబర్లు 295, 296లో ఉందని, కానీ కాలక్రమంలో భూమి విస్తీర్ణం 45.80 ఎకరాల నుంచి 77.54 ఎకరాలకు పెరిగిందని రికార్డులు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో వెబ్‌ల్యాండ్ నమోదులో అసమానతలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విస్తీర్ణం పెరగడానికి ఎవరి ప్రమేయం ఉందో వివరాలతో రిపోర్టు సమర్పించాలన్నారు. 

Also Read: భార్యాభర్తల మధ్య లొల్లి పెట్టిన కుక్క.. కోర్టు మెట్టులెక్కిన భర్త!

తప్పకుండా అటవీ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఆయన విజిలెన్స్ నివేదికను ప్రాతిపదికగా తీసుకొని, కేసులు ఎలా సాగుతున్నాయో తెలుసుకోవాలని, ఆక్రమణల తొలగింపుపై సమీక్ష చేయాలని ఆదేశించారు. అటవీ భూములు జాతికి చెందిన ఆస్తి. వాటిని ఆక్రమించడం అంటే చట్టాన్ని అతిక్రమించడమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అన్ని ఆక్రమణ వివరాలు అంటే కేసులు, స్థితిగతులు, కోర్టు విచారణలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు.

Advertisment
తాజా కథనాలు