Missing Case: మణిపుర్లో మహిళలు, చిన్నారులు మిస్సింగ్
మణిపూర్లో సోమవారం మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. అప్పటినుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు. వాళ్ల ఆచూకి కోసం భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు
మణిపూర్లో సోమవారం మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. అప్పటినుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు. వాళ్ల ఆచూకి కోసం భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు
ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే పిల్లలకు గుండెపోటు వస్తుంది. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఒత్తిడి వల్ల పిల్లల గుండెపై ప్రభావం చూపిస్తున్నాయి. పిల్లవాడు లావుగా ఉంటే కొవ్వును కరిగించడానికి వ్యాయామాలు చేయించాలని నిపుణులు చెబుతున్నారు.
తోడేళ్ల బెడదతో ఉత్తరప్రదేశ్ బహ్రెయిచ్ జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నెలన్నరలోనే తోడేళ్ల దాడిలో 9 మంది మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. చిన్నారులే టార్గెట్గా వేటాడుతుండగా రాత్రి పిల్లలను చీరలతో కట్టేసుకుంటున్నారు తల్లులు. తోడేళ్లకోసం ఫారెస్టు అధికారులు గాలిస్తున్నారు.
నవజాత శిశువులకు ఆవు పాలు పట్టించడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఈ పాలలోని కాంప్లెక్స్ ప్రొటీన్, మినరల్స్ పిల్లలు సరిగ్గా జీర్ణించుకోలేరు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణుల సూచన.
స్కార్లెట్ ఫీవర్ అంటువ్యాధి. ఇది స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఎక్కువగా 5 నుంచి 15 సంవత్సరాలు వయసున్న పిల్లలకే ఈ జ్వరం ఎక్కువగా వస్తుంది. పిల్లలు తుమ్మిన, దగ్గిన తుంపర్లు ద్వారా ఇతర పిల్లలకు చేరుతుంది.
మానసిక ఒత్తిడి కారణంగా, జింక్, రక్త హీనత, కాల్షియం లోపం వలన మట్టి రుచిని ఇష్టపడతారని నిపుణులు అంటున్నారు. ఇది ఒక రకమైన శారీరక, మానసిక వ్యాధి. నాలుగేళ్ల తర్వాత ఈ అలవాటు మానుకోకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిదని హెచ్చరిస్తున్నారు.
ముక్కుపచ్చలారని ఇద్దరు కొడుకులను తల్లి బకెట్ నీళ్లలో ముంచి చంపిన ఘటన కర్నూల్ జిల్లాలో స్థానికులను కలిచివేసింది. హాల్వి గ్రామానికి చెందిన శారద.. భర్త రామకృష్ణ లేని సమయంలో వెంకటేశ్ (3), భరత్ (6 నెలలు)లను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతుంది.
పిల్లలు ఎక్కువసేపు స్మార్ట్ఫోన్ వాడితే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఒకరోజులో నాలుగు గంటల కన్నా ఎక్కువసేపు స్మార్ట్ఫోన్లు వాడితే ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు, దురాలవాట్లు పెరుగుతున్నాయని బయటపడింది.