Uttar Pradesh: చిన్నారులను పీక్కుతింటున్న తోడేళ్లు.. 9 మంది మృతి, 30 మందికి గాయాలు! తోడేళ్ల బెడదతో ఉత్తరప్రదేశ్ బహ్రెయిచ్ జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నెలన్నరలోనే తోడేళ్ల దాడిలో 9 మంది మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. చిన్నారులే టార్గెట్‌గా వేటాడుతుండగా రాత్రి పిల్లలను చీరలతో కట్టేసుకుంటున్నారు తల్లులు. తోడేళ్లకోసం ఫారెస్టు అధికారులు గాలిస్తున్నారు. By srinivas 28 Aug 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ప్రజలను తోడేళ్లు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా బహ్రెయిచ్ జిల్లాలో రాత్రిపూట ఇళ్లపై దాడులకు పాల్పడుతూ.. చిన్నారులను ఎత్తుకెళ్లి పీక్కుతింటున్నాయి. నెలన్నర వ్యవధిలోనే తోడేళ్ల దాడిలో 9 మంది మృతి చెందగా, 30 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువగా చిన్నారులే ఉండటం బాధకరమైన విషయం. కాగా తోడేళ్ల భయంతో దీంతో 24 గ్రామాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి. రాత్రిపూట తోడేళ్లు దాడులు చేస్తుండగా స్థానికులు రాత్రంతా కాపలా ఉంటున్నారు. ఇళ్లలో చిన్నారులను చీరలతో తమకు కట్టేసుకుని మహిళలు పడుకుంటున్నారు. అయితే నరహంతక తోడేళ్ల కోసం 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. హై ఫ్రీక్వెన్సి డ్రోన్ కెమెరాలతో తోడేళ్ల గుంపుల కోసం వెతుకులాట కొనసాగుతోందని, ఇప్పటివరకూ 3 తోడేళ్లను పట్టుకున్నట్లు ఫారెస్టు అధికారులు వెల్లడించారు. #childrens #wolves #uttar-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి