సంతానోత్పత్తి రేటు పెంచేందుకు రష్యా కీలక ప్రకటన చేసింది. 25 ఏళ్ల లోపు యువతులు ఆరోగ్యకరమైన చిన్నారులకు జన్మనిస్తే రూ.81 వేలు ఇస్తామని ప్రకటించింది. గత ఏడాది జననాలు తగ్గడంతో ఆ దేశంలోని కరేలియా యంత్రాంగం ఈ ప్రకటన చేసింది. కరేలియాకు చెందిన వారై స్థానికంగా చదివేవారిని ఈ స్కీమ్ కు అర్హులుగా పేర్కొంది. అయితే ఇప్పటికే పిల్లలున్న వారికి ఇది వర్తించదని తేల్చి చెప్పింది. ఇతర ప్రాంతాలు ఇదే విధానాన్ని అనుసరించే యోచనలో ఉన్నాయి. అయితే పుట్టిన కొన్ని రోజులకు శిశువు మరణిస్తే తల్లులకు పరిహారం ఇస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ పథకం అసలు అమలు అవుతుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. 600 మంది పిల్లలు మాత్రమే రష్యా ఫెడరల్ స్టేట్ స్టాటిస్టిక్స్ సర్వీస్ లేదా రోస్‌స్టాట్ ప్రకారం, 2024లో 5లక్షల 99వేల 600 మంది పిల్లలు మాత్రమే జన్మించారు . 2023తో పోల్చితే ఇది 2.7 శాతం తక్కువ. గత 25 ఏళ్లతో పోలిస్తే జననాల రేటు ఇదే అత్యల్పం కావడం గమనార్హం. దీంతో ఈ పరిస్థితిపై రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఇది దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ క్రమంలో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం ఫలితంగా రష్యా భారీ నష్టాలను చవిచూసింది. గత సంవత్సరం కూడా దేశం మొత్తం జనాభాలో తగ్గుదల కనిపించింది, ఇది 2023లో దాదాపు రెండు రెట్లు తగ్గింది. పరిస్థితిని అందుబాటులోకి తేవడానికి రష్యాలోని కనీసం 11 ప్రాంతాలు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళా విద్యార్థులకు ప్రోత్సాహకాలను ప్రకటించాయి. ఇక రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య చాలా రోజులుగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఈ రెండు దేశాలు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు వెళ్తున్నాయి. ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా యుద్ధం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా రష్యా దక్షిణ ఉక్రెయిన్‌పై క్షిపణి దాడి చేయగా.. ఈ ఘటనలో 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. Also Read : నిమిషానికి 4 లక్షల బులెట్లతో చైనా కొత్త గన్.. డేంజర్లో అగ్రరాజ్యం!