Mobile Usage : మొబైల్ వాడొద్దని మందిలించిన అన్నను కడతేర్చిన చెల్లి.. మొబైల్ వాడొద్దని వారించినందుకు సొంత అన్నను చెల్లి గొడ్డలి తో నరికి చంపిన ఘటన ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన కేసీజీ జిల్లాలో వెలుగు చూసింది. వివారాల్లోకి వెళ్తే.. By Durga Rao 05 May 2024 in క్రైం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Sister : ఛత్తీస్గఢ్(Chhattisgarh) లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మొబైల్ వాడొద్దని వారించినందుకు సొంత అన్నపై కోపం పెంచుకున్న ఓ 14 ఏళ్ల బాలిక అతడు నిద్రలో ఉండగా గొడ్డలితో నరికి చంపేసింది. కేసీజీ జిల్లా(KCG District) లో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇతర కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో అన్నాచెల్లెళ్ల(Brother & Sister) మధ్య గొడవ మొదలైంది. నిత్యం మొబైల్ ఫోన్లో(Mobile Phone) ఇతర కుర్రాళ్లతో మాట్లాడుతున్న చెల్లెల్ని అన్న మందలించాడు. సెల్ఫోన్ వినియోగం తగ్గించాలని కోపడ్డాడు. దీంతో, బాలిక తీవ్ర ఆగ్రహానికి లోనైంది. అతడు పడుకున్న సమయంలో గొడ్డలితో గొంతు నరికి చంపేసింది. ఆ తరువాత రక్తం మరకలు తొలగించుకునేందుకు స్నానం చేసి వచ్చిన ఆమె ఆ తరువాత ఇరుగుపొరుగుకు తన అన్నను ఎవరో హత్య చేశారని చెప్పింది. అయితే, పోలీసుల విచారణ సందర్భంగా బాలిక చివరకు చేసిన నేరాన్ని అంగీకరించింది. Also Read : నాన్ రోటీలు ఇలా ట్రై చేయండి.. #chhattisgarh #brother #crime-news #sister మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి