Chandrababu Oath Taking: మరికాసేపట్లో చంద్రబాబు ప్రమాణస్వీకారం.. ఏర్పాట్లు ఇవే!
మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. అందుకోసం విజయవాడ దగ్గరలోని కేసరపల్లిలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీతో పాటు, పలువురు మంత్రులు,ప్రముఖులు హాజరు కానున్నారు.