CM Chandrababu: సీఎం చంద్రబాబుతో బెల్జియం బృందం భేటీ
AP: సీఎం చంద్రబాబుతో బెల్జియం బృందం భేటీ అయింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై సీఎంతో చర్చించారు. ఏపీలో వ్యాపార వర్గాలకు అనుకూల వాతావరణం సృష్టిస్తామని చంద్రబాబు అన్నారు.
AP: సీఎం చంద్రబాబుతో బెల్జియం బృందం భేటీ అయింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై సీఎంతో చర్చించారు. ఏపీలో వ్యాపార వర్గాలకు అనుకూల వాతావరణం సృష్టిస్తామని చంద్రబాబు అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న పాత ఫోటోను ప్రధాని మోదీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 2016లో విశాఖపట్నంలో చంద్రబాబుతో కాఫీ తాగుతూ ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోను టీడీపీ శ్రేణులు తెగ షేర్ చేస్తున్నారు.
మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ యాప్ పేరును చంద్రబాబు ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీ యాప్ గా మార్చింది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
చంద్రబాబు సర్కార్ జగన్ ప్రభుత్వ హయంలోని పలు పథకాల పేర్లు మార్పు చేసింది. జగనన్న విద్యా దీవెన - పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, వైఎస్సార్ కళ్యాణమస్తు - చంద్రన్న పెళ్లి కానుక, వైఎస్సార్ విద్యోన్నతి - ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేర్లను మార్చింది.
కూటమి ఘనవిజయానికి కారణమైన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబు. అధికారం వచ్చిందని కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
పవన్ విషయంలో చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పవన్‌కు ఎక్కడా ప్రాధాన్యం తగ్గకుండా చూస్తున్నారు. ప్రతి ప్రభుత్వ ఆఫీస్‌లో తన ఫొటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ఫొటోలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరి ఫొటోలు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాలనలో సీఎం చంద్రబాబు తన మార్క్ చూపిస్తున్నారు. టీటీడీ ప్రక్షాళనతో పనిమొదలు పెట్టిన చంద్రబాబు.. ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. అన్ని విభాగాల్లోనూ మార్పులు, చేర్పులకు సీఎం కసరత్తు చేస్తున్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చినహామీ మేరకు.. తొలిసంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు బాబు ప్రకటించారు.
AP: అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. స్కూల్ పిల్లలకు ఇచ్చే కిట్పైన జగన్ బొమ్మ ఉన్నా పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ డబ్బులు వృధా కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈరోజు నుంచి బడులు తెరవడంతో విద్యార్థులకు స్కూలు కిట్ పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.