CM Chandrababu: నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు AP: ఈరోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. ఏలేరు వరద ముంపు గ్రామం రాజుపాలెం గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులతో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. By V.J Reddy 11 Sep 2024 | నవీకరించబడింది పై 11 Sep 2024 08:51 IST in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి CM Chandrababu: ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో ఈరోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఏలేరు వరద ముంపు గ్రామం రాజుపాలెం గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్నారు. ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులతో చంద్రబాబు మాట్లాడనున్నారు. అనంతరం సామర్లకోటలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఏలేరు ఆధునీకరణ, తీసుకోవలసిన చర్యలపై రివ్యూ చేయనున్నారు. ఇప్పటికే వరద బాధితులకు అవసరమైన నిత్యావసర వస్తువులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పర్యటనలో మార్పులు... సీఎం చంద్రబాబు పర్యటన లో మార్పు చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఏలూరు జిల్లాలో పర్యటన చేయనున్నారు. బుధవారం ఉదయం 11.10 హెలికాప్టర్ లో ఏలూరు సి ఆర్ రెడ్డి కళాశాల కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకుంటారు. 11. 25 కు తమ్మిలేరు బ్రిడ్జికి చేరుకొని వరద పరిస్థితిని పరిశీలించి ,11:45 కు సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియం చేరుకుంటారు. అక్కడ రైతులు వరద బాధితులతో మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం 12:30 కు సి ఆర్ రెడ్డి కళాశాల హెలిపాడ్ కు చేరుకొని హెలికాప్టర్లో సామర్లకోట వెళ్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. #kakinada #chandrababu #andhra-pradesh-floods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి