CM Chandrababu Returns To AP : సీఎం చంద్రబాబు (Chandrababu) ఢిల్లీ పర్యటన (Delhi Tour) ముగిసింది. ఈరోజు ఏపీకి తిరిగి రానున్నారు. ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లిన ఆయన రెండు రోజులపాటు పర్యటించారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ఏపీ అభివృద్ధి విషయంపై పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపు, మెరుగైన రహదారుల నిర్మాణం వంటి కీలక అంశాలపై చర్చలు జరిపారు., అలాగే ఈ పర్యటనలో ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. దాదాపు రెండు గంటల పాటు మోదీ (PM Modi) తో చర్చలు జరిపిన చంద్రబాబు.. ఏపీకి రావాల్సిన నిధులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..CM Chandrababu : ముగిసిన ఢిల్లీ పర్యటన.. నేడు ఏపీకి సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు ఈరోజు ఏపీకి రానున్నారు. ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లిన ఆయన నిన్న ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, తాజా రాజకీయ పరిస్థితులపై వారితో చర్చించారు.
Translate this News: