Car Accident : ఓఆర్ఆర్పై మరో ప్రమాదం.. ఒకరు మృతి
ఓఆర్ఆర్పై మరో ప్రమాదం చోటుచేసుకుంది. హిమాయత్‌సాగర్ ఔటర్ రింగు రోడ్డుపై డివైడర్‌ను ఢీకొన్న ఓ కారు కిందపడిపోయింది. కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. మృతుడు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు నిలయరెడ్డిగా పోలీసులు గుర్తించారు.
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. చెల్లాచెదురైన మృతదేహాలు!
ఏపీ కర్నూల్ జిల్లా హోలేబీడు గ్రామ సమీంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడి ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు అదోని వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Texas : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి!
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నెంబర్ 75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. వారిలో ముగ్గురు హైదరాబాద్ వాసులు ఉన్నారు.హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
Accident : కారు బీభత్సం.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని..
హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తు, అతివేగంతో వ్యక్తిని ఢీకొట్టిన కారు ఆ తర్వాత కరెంట్ స్తంభాలను సైతం ఢీకొట్టి దూసుకెళ్లింది. స్పాట్లోనే వ్యక్తి మృతి చెందాడు. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని గాజుల రామారంలో ఘటన చోటుచేసుకుంది.
Car Accident: ఏపీలో కారు భీభత్సం.. భయంతో పరుగులు తీసిన జనం: వీడియో
ఏపీలోని మారేడుమిల్లిలో కార్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ఓ ఇంటివైపు దూసుకెళ్లింది. స్థానికులు భయంతో పరుగులు పెట్టగా కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అదే చోట స్కూటీ అదుపుతప్పి ఓ వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి.
Accident: కారుతో స్టంట్లు చేస్తూ తల్లీ కూతుళ్లను ఢీ కొట్టిన 17 ఏళ్ల బాలుడు.. వీడియో వైరల్!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భయంకరమైన కారు ప్రమాదం జరిగింది. కాన్పూర్‌లో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ 17 ఏళ్ల బాలుడు కారుతో స్టంట్స్ చేస్తూ తల్లీకూతుళ్లు వెళ్తున్న స్కూటీని ఢీ కొట్టాడు. తల్లి చనిపోగా బాలిక పరిస్థితి విషమంగా ఉంది. యాక్సిడెంట్ వీడియో వైరల్ అవుతోంది.
Accident : కారు బీభత్సం.. ఇద్దరు మృతి..!
హైదరాబాద్ శామీర్‌పేట్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా డివైడర్‌ను ఢీ కొట్టిన కారు అదుపుతప్పి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో ఓ యువతి, యువకుడు స్పాట్లోనే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదంలో టయోటా ఇన్నోవా కారు నుజ్జునుజ్జయింది.
EX Mla Rajayya: మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి!
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది.హనుమకొండ మడికొండకు చెందిన స్వప్న (40) ఎస్సీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.