/rtv/media/media_files/2025/01/25/EcXjuFcsWS7XEu6sUhXA.jpg)
Accident In Banjarahills
బంజారాహిల్స్ లో బసవతారకం ఆసుపత్రి దగ్గర ఒక కారు అర్ధరాత్రి అదుపు తప్పింది. దీంతో కారు ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడ నిద్రిస్తున్న ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలయ్యాయి. యాక్సిడెంట్ అయ్యాక కారును అందులో ఉన్న వారు దాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు ఎవరిది అన్న ఆరా తీస్తున్నారు. దాన్ని బట్టి నిందితులను అరెస్ట్ చేసి యాక్సిడెంట్ కు కారణాలు తెలుసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు తాగి డ్రైవ్ చేయడం వలనే ప్రమాదానికి కారణం అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: Cinema: సీజ్ ద లయన్ అంటున్న రాజమౌళి..ఎస్ఎస్ఎమ్బీ29 షూటింగ్ మొదలైనట్టేనా?
Follow Us