ఇక్కడ ఎవడి ఫామ్ హౌస్ కడుతున్నావ్ !Farm House Issue| | RTV
ఇక్కడ ఎవడి ఫామ్ హౌస్ కడుతున్నావ్ | Kavitha Father In Law explains about the farm house being built in their own land that belongs to Kalvakuntla Kavitha| RTV
ఇక్కడ ఎవడి ఫామ్ హౌస్ కడుతున్నావ్ | Kavitha Father In Law explains about the farm house being built in their own land that belongs to Kalvakuntla Kavitha| RTV
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీర్ఎస్ కార్యకర్తలు కవితకు ఘనస్వాగతం పలికారు. పెద్ద ఎత్తున జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి భారీ ర్యాలీతో బంజారాహిల్స్ లోని తమ నివాసానికి బయలుదేరారు కవిత.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదల కాగానే సంచలన కామెంట్స్ చేశారు. 'నేను సాధారణంగా మొండిదాన్ని. ఇంకా నన్ను జగమొండిని చేశారు. ఏ తప్పు చేయకపోయినా రాజకీయ కక్షతో కావాలనే ఇబ్బందులు పెట్టారు. మూల్యం చెల్లించి తీరుతా' అన్నారు.
తీహార్ జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత తనను టార్గెట్ చేసి వేధించిన వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనను, తన కుటుంబాన్ని వేధించిన వారికి తప్పకుండా వడ్డీతోపాటు చెల్లిస్తామన్నారు. తాను కేసీఆర్ బిడ్డను అని, తాను తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం హామీతోనే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. విలీనం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయన్నారు. మోదీకి కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే అని, కవిత లిక్కర్ మాఫియా క్వీన్ అంటూ విమర్శలు గుప్పించారు.
కవిత బెయిల్ ప్రక్రియను సాయంత్రంలోగా పూర్తి చేసేందుకు కేటీఆర్ హడావుడిగా సుప్రీం కోర్టు నుంచి తిహార్ జైలుకు బయల్దేరారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యను తప్పించుకునేందుకు తన కారు దిగి ప్యాసింజర్ ఆటో ఎక్కారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కవితకు బెయిల్ మంజూరు కావడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేటీఆర్కు ఫోన్ చేసి విడుదలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈరోజు లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలవనున్నారు. కాగా మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనారోగ్యం బారిన పడ్డారు. మంగళవారం ఉన్నట్టుండి ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన జైలు సిబ్బంది కవితను దీన్ దయాల్ హాస్పిటల్కు తరలించగా డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.