Earthquake in AP: ఏపీలో మళ్లీ భూకంపం.. భయంతో జనం పరుగులు!
ఏపీ ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. దర్శి నియోజకవర్గంలో ఉదయం 10.34 నిమిషాలకు శబ్దాలతో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లలోకి పరుగులు తీశారు.
ఏపీ ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. దర్శి నియోజకవర్గంలో ఉదయం 10.34 నిమిషాలకు శబ్దాలతో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లలోకి పరుగులు తీశారు.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో మెజిస్ట్రేట్ ఆరుగురికి రిమాండ్ విధించారు. దాడి చేసిన వారిని రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్‌గా జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.
గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. అతనితో పాటు తన కుమారుడుకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల్లోగా విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు.
బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైరు ఊడిపోయి.. ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 38 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కాకినాడలో ఉప్పాడలోని ఓ చిన్నారి ఇంట్లో ఆడుతుంటే బీరువా పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించగా కాకినాడ ఆసుపత్రికి ఆక్సిజన్ సాయంతో తీసుకెళ్లమన్నారు. కానీ అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో మార్గమధ్యంలోనే ఆ చిన్నారి మృతి చెందింది.