విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన అంబులెన్స్

కాకినాడలో ఉప్పాడలోని ఓ చిన్నారి ఇంట్లో ఆడుతుంటే బీరువా పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించగా కాకినాడ ఆసుపత్రికి ఆక్సిజన్ సాయంతో తీసుకెళ్లమన్నారు. కానీ అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో మార్గమధ్యంలోనే ఆ చిన్నారి మృతి చెందింది.

New Update
Crime News : బిడ్డకు జన్మనిచ్చి.. రోడ్డుపై పడేసిన 23 ఏళ్ల యువతి

ఇంట్లో బుడి బుడి అడుగులు వేస్తూ సందడి చేస్తున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు మరణించింది. ఇంట్లో ఆడుకుంటుండగా.. అకస్మాత్తుగా బీరువా పడిపోవడంతో చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఉప్పాడలో రత్నప్రకాశ, జోగి ఫణికుమార్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ సైన్యంపై తాబన్ల దాడి..16 మంది మృతి

అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో..

వీరిలో మూడేళ్ల చిన్నకుమార్తె జెట్సీ జయకీర్తన ఇంట్లో ఆడుకుంటుంది. ఈ క్రమంలో చెక్క బీరువాను పట్టుకోగా.. ఒక్కసారిగా ఆ చెక్క బీరువా ఆమెపై పడింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆ బీరువాను తీశారు. ఆ చిన్నారి వెంటనే అపస్మారకస్థితిలో వెళ్లపోవడంతో దగ్గరలో ఉన్న కొత్తపల్లి పీహెచ్‌సీకి తరలించేందుకు బయలుదేరారు. దారిలో వాకతిప్పలో జగన్‌ జన్మదిన వేడుకలను కొందరు వైసీపీ నేతలు నిర్వహిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. 

ఇది కూడా చూడండి: TS: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకూ తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు

అప్పటికీ తండ్రి కూతురిని ఎత్తుకుని మరి పరుగుల తీశారు.  దీంతో బాలిక తండ్రి ఫణికుమార్‌ చిన్నారిని భుజాన ఎత్తుకుని కొంత దూరం పరుగులు తీశారు. ఆ తర్వాత మళ్లీ వాహనం మీద తీసుకెళ్లారు. అయితే చిన్నారి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.

ఇది కూడా చూడండి: పీఎఫ్ నిధుల మోసం కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్

వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ ఆ పాపను తీసుకెళ్లడానికి అంబులెన్స్ రాలేదు. అంబులెన్స్‌లో అయితే ఆక్సిజన్ ఉంటుందని ఇందులోనే వెళ్లాలని డాక్టర్లు సూచించడంతో వెయిట్ చేశారు. కానీ వాహనం దాదాపుగా గంట తర్వాత వచ్చింది. ఇంతలో బాలిక పరిస్థితి విషమించడంతో మార్గంలోనే మృతి చెందింది. 

ఇది కూడా చూడండి: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు