Lok Sabha Elections : లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే..
తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం సాయంత్రం ముగిసింది. మొత్తం 306 అప్లికేషన్లు వచ్చాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చివరి రోజు కావడంతో శనివారం ఒక్కరోజే 166 మంది దరఖాస్తులు చేసుకున్నారు.