Kharge: మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇక ఎన్నికలు ఉండవు: ఖర్గే!
భారత్ లో మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇక పై ఎన్నికలు జరగవని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. కాబట్టి ఈ సారి ఎన్నికల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఓటేయాలని కోరారు. మోడీ ఈసారి ప్రధాని అయితే మాత్రం దేశంలో నియంతృత్వమే రాజ్యం ఏలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.