Raja Singh : రాజాసింగ్ హత్యకు కుట్ర.. హైదరాబాద్ లో కలకలం!

బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్న ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారి ఫోన్లలో గన్నులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటోలు ఉండడంతో హత్యకు కుట్ర జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

New Update
Raja singh Murder sketch

బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చంపేందుకు కుట్ర జరిగిందన్న వార్తలు రావడంతో హైదరాబాద్ లో కలకలం రేగింది. ఈ రోజు రాజాసింగ్ ఇంటి దగ్గర ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. దీంతో వారిని పట్టుకున్న స్థానికులు మంగళహాట్ పోలీసులకు అప్పగించారు. వీరిని ఇస్మాయిల్, మహ్మద్ ఖాజాగా గుర్తించిన పోలీసులు పూర్తి వివరాలను తెలుసుకోవడానికి విచారణ చేస్తున్నారు.

ఫోన్లో తుపాకులు, రాజా సింగ్ ఫొటో:

అయితే.. ఈ ఇద్దరి ఫోన్లలో తుపాకులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటో ఉండడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజాసింగ్ ను హత్య చేసేందుకే ఈ ఇద్దరు వచ్చారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసు విచారణలో ఏం తేలుతుందనే అంశం ఉత్కంఠగా మారింది. 

Also Read :  ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌశిక్ రెడ్డి పరామర్శ!

Advertisment
తాజా కథనాలు