Prime minister Modi:తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోదీ.
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ప్రధాన నరేంద్రమోదీ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ను విజయవంతంగా నడిపారు. ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపిన అనుభవం అద్భుతంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ప్రధాన నరేంద్రమోదీ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ను విజయవంతంగా నడిపారు. ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపిన అనుభవం అద్భుతంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
విశాఖ నుంచి సికింద్రాబాద్ , తిరుపతి, బెంగళూరులకు వెళ్లే వారాంతపు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లను డిసెంబర్ 4 నుంచి నడపనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.
విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వల్ల తల్లితో పాటు 9 నెలల చిన్నారి కూడా మృతి చెందింది. రోడ్డు పై విద్యుత్ వైరు తెగిపడడం..చీకట్లో అది కనిపించక దాని మీద కాలు వేసిన తల్లి, బిడ్డ మృతి చెందారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.
కివీస్ సెమీస్ అవకాశాలకు వరుణుడు గండం పెట్టేలా ఉన్నాడు. బెంగళూరు వేదికగా శ్రీలంకపై జరగనున్న మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. వర్షంతో మ్యాచ్ రద్దయితే కివీస్‌కు సెమీస్ అవకాశాలు లేనట్లే!
బెంగళూరు నడిరోడ్డుపై ఘోరం జరిగింది. ఇవ్వాల్సిన డబ్బులు అడిగినందుకు అస్గర్ అనే కారు డీలర్‌ను స్కార్పియోతో గుద్దించి చంపాడు అమ్రీన్. రోడ్డుపై అందరూ చూస్తుండగానే కారుతో వెంబడించి, వేటాడి చంపాడు. అస్గర్ దగ్గర నుంచి కారు కొనుగోలు చేసిన అమ్రీన్ అతనికి రూ.4లక్షల చెల్లించాల్సి ఉంది.
మునుపు ఎవరూ చేయని విధంగా చోరీ చేసి.. యావత్ దేశాన్నే తమవైపు తిప్పుకున్నారు. అవును, కర్నాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఈ దొంగలు విచిత్రమైన చోరీ చేశారు. ప్రజల ఇళ్లలో పడితే పట్టుకుంటున్నారని అనుకున్నారో ఏమో గానీ.. పబ్లిక్ ప్లేసులోనే దర్జాగా చోరీ చేసుకెళ్లారు. బెంగళూరులోని కన్నింగ్‌హామ్ రోడ్లో ఏర్పాటు చేసిన రూ. 10 లక్షల విలువైన స్టెయిన్ లెస్ స్టీల్ బస్ షెల్టర్‌ను మాయం చేశారు చోర కళా వల్లభులు.
ఎయిర్ ఏషియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం ఇక్కడి కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే తిరిగి వచ్చింది. ఆదివారం రాత్రి బెంగళూరుకు బయలుదేరిన కొచ్చి-బెంగళూరు విమానం రాత్రి 11.15 గంటలకు టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక సమస్య తలెత్తిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత విమానంలో హైడ్రాలిక్ సమస్య ఉన్నట్లు గుర్తించారు.