Bengaluru: జూదానికి బానిసైన విద్యార్ధిని..ఆత్మహత్య యూనివర్శిటీ విద్యార్ధిని..19 ఏళ్ళ పవన. బెంగళూరు మహారాణి క్లస్టర్ యూనివర్శిటీలో చదువుకుంటోంది, తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. జూదానికి బానిసై తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుని చివరకు ప్రాణాలను కూడా కోల్పోయింది. By Manogna alamuru 19 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Student Sucide: బెంగళూరు మహారాణి క్లస్టర్ యూనివర్శిటీలో విషాదం చోటు చేసుకుంది. కోలారు జిల్లా శ్రీనివాసపూర్‌కు చెందిన పవన అనే అమ్మాయి తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. ఈమె యూనివర్శిటీలో మొదటి సంవత్సరం బీఎస్సీ చదువుతోంది. పవన ఆన్ లైన్ గేమ్‌లకు బాగా అలవాటు పడింది. తల్లిదండ్రులు కాలేజీ ఫీజు కోసం 15వేల రూపాయలు పంపించారు. ఆ డబ్బంతా ఆన్‌లైన్ గేమ్‌లో పెట్టింది అవి కాస్తా పోయాయి. దీంతో మనస్తాపం చెందిన పవన..హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. Also read:Andhra Pradesh: ఏపీ ఇంటర్ విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త! పవన ఆన్‌లైన్ గేమింగ్‌కు బాగా అలవాటు పడిపోయింది. ఇందులో పడి చాలా డబ్బులే పోగొట్టుకుంది. డబ్బు అంతా పోగొట్టుకోవడం… ఆర్థిక ఒత్తిడి, పోగొట్టుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో ఆమె దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక పరిస్థితులు తీవ్రం అవ్వడంతోనే ప్రాణాలు తీసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. Also Read:Andhra Pradesh: ఏపీ మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు #student #online-game #bengaluru #sucide మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి