AP: స్నానానికని బాత్రూంలోకి వెళ్లిన చిన్నారులు..ఎంతకీ రాకపోయేప్పటికీ....
స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లిన ముగ్గురు చిన్నారులు అపస్మారక స్థితిలోకి చేరుకోవడం కలకలం రేపింది. వేడి నీటి నుంచి వచ్చిన పొగకు చిన్నారులకు ఊపిరాడలేదు. దీంతో వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.