/rtv/media/media_files/2025/03/11/2bO5ggWiQKpUPeOs6H6E.jpg)
Vastu Tips Photograph: (Vastu Tips)
హిందూ సంప్రదాయంలో చాలా మంది వాస్తు నియమాలు పాటిస్తుంటారు. మూలన కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే ఇంట్లోని బాత్రూమ్‌లో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు, గొడవలు, రుణ బాధలు అన్ని కూడా పోయి సంతోషం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే బాత్రూమ్‌లో ఉంచాల్సిన ఆ వస్తువులు ఏంటో చూద్దాం.
ఇది కూడా చూడండి: Lalit Modi: 'వనువాటు అందమైన దేశం'.. లలిత్ మోదీ సంచలన పోస్ట్
ఉప్పు
ఒక గాజు గిన్నోలో కాస్త రాళ్ల ఉప్పు వేసి బాత్రూమ్‌లో ఉంచితే ఇంట్లోని నెగిటివ్ శక్తి అంతా కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఉప్పు బాగా సాయపడుతుంది. అయితే ప్రతీ వారం ఈ ఉప్పును మారుస్తుండాలి.
ఇది కూడా చూడండి: Elan Musk: ఎక్స్ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్ దాడే అంటున్న మస్క్!
కర్పూరం
ఇంట్లోనే కాకుండా బాత్రూమ్‌లో కూడా అప్పుడప్పుడు కర్పూరం వెలిగించాలి. దీనివల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలాగే ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!
లవంగం
ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే ఒక ఐదు లవంగాలను గిన్నెలో వేసి బాత్రూమ్‌లో ఉంచాలి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. అయితే బాత్రూమ్‌లోనే కాకుండా పర్స్‌లో కూడా లవంగాలు ఉంచవచ్చు. దీనివల్ల మీకు ఆర్థిక సమస్యలు తొలగి సంపద వృద్ధి చెందుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. పూర్తి వివరాలకు నిపుణులను సంప్రదించండి.
ఇది కూడా చూడండి: Niharika Konidela: నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను.. నిహారిక ఎమోషనల్ పోస్ట్ ఎవరి గురించో తెలుసా!