AP: స్నానానికని బాత్రూంలోకి వెళ్లిన చిన్నారులు..ఎంతకీ రాకపోయేప్పటికీ....

స్నానం చేయ‌డానికి బాత్రూంలోకి వెళ్లిన ముగ్గురు చిన్నారులు అపస్మారక స్థితిలోకి చేరుకోవడం కలకలం రేపింది. వేడి నీటి నుంచి వచ్చిన పొగకు చిన్నారులకు ఊపిరాడలేదు. దీంతో వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని ఆస్పత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

New Update
Three children unconscious

Three children unconscious

AP: స్నానం చేయ‌డానికి బాత్రూంలోకి వెళ్లిన ముగ్గురు చిన్నారులు అపస్మారక స్థితిలోకి చేరుకోవడం కలకలం రేపింది. ఏపీలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండకు చెందిన ముగ్గురు చిన్నారుల స్నానం కోసం త‌ల్లి బాత్రూంలోని గీజ‌ర్ ఆన్ చేసింది. స్నానం చేయడానికి ముగ్గురు పిల్లలు బాత్రూంకు వెళ్లారు. లోప‌లికి వెళ్లిన చిన్నారులు ట్యాప్ ఆన్ చేశారు. గీజ‌ర్ ఓపెన్ చేయగానే వేడివేడి నీరు పొగలు కక్కుతూ వచ్చింది. ఆ నీటిని బకెట్లో పట్టుకున్నారు. నీరు నుంచి పొగలు రావడంతో పాటు వేడి నీటి నుంచి వచ్చిన ఆవిరితో బాత్రూం నిండిపోయింది. ఆ పొగకు చిన్నారులకు ఊపిరాడలేదు. దీంతో వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. అయితే పిల్లలు స్నానం చేస్తున్న అలికిడి వినపడకపోవడంతో తల్లి వెళ్లి గమనించే సరికి ముగ్గురు పిల్లలు కిందపడి కనిపించారు. దీంతో వెంట‌నే చిన్నారుల‌ను ఉర‌వ‌కొండ ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించగా చికిత్స అందిస్తున్నారు. పిల్లల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు