Ap:ఏపీలో వీరికి ఆదివారం.. రంజాన్ సెలవులు లేవు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 30,31న ఆదివారం, సోమవారం మున్సిపాలిటీల్లో రంజాన్ సెలవులు లేవు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 30,31న ఆదివారం, సోమవారం మున్సిపాలిటీల్లో రంజాన్ సెలవులు లేవు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
వచ్చే నెల 7 నుంచి ఏపీలోని ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆఫా అధ్యక్షుడు విజయ్ ఓ ప్రకటనలో తెలిపారు. బిల్లులు చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ ఏపీకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి.. వాటి ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు రావచ్చనే దానిపై మంత్రి నారా లోకేష్ వివరాలు వెల్లడించారు.
ఏపీలో అకాల వర్షాలు.. మరో నాలుగు రోజులు కురుస్తాయని ఈ సమయంలో వడగళ్ల వాన పడుతుందని.. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.క్యుములో నింబస్ మేఘాలతో వర్షం, వడగళ్ల వాన, పిడుగులు పడతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో సంస్కృతం పరీక్షలో ముగ్గురు రెగ్యులర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పేపర్‌ను,మరో ముగ్గురు సప్లిమెంటరీ విద్యార్థులకు రెగ్యులర్ ప్రశ్నాపత్రాన్ని ఇన్విజిలేటర్ ఇచ్చారు. దీంతో వారు తల్లిదండ్రులకు ఈవిషయం చెప్పడంతో వారు ఆందోళనకు దిగారు.
నంద్యాల లో వైసీపీకి నంద్యాల సుధాకర్ రెడ్డి (48) ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. గత కొంతకాలంగా గ్రామంలో కొందరితో విభేధాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు.పొలం నుంచి తిరిగి వస్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది.
రాష్ట్రాల అప్పు భారీగా పెరిగిపోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించిన అప్పుల డేటాను విడుదల చేసింది. తమిళనాడు 8.3 లక్షల కోట్లతో 1 స్థానంలో ఉంది. తెలంగాణ 5.4 లక్షల కోట్లతో 7వ, ఏపీ 4.9 లక్షల కోట్లతో 8వ స్థానంలో ఉన్నాయి.
ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య షహనాజ్ మరణించారు. ఐదారు నెలలుగా ఆమె తీవ్ర అనారోగ్యతో బాధపడుతున్నారు. ఇంట్లో వెంటిలెటర్ పై చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి మృతి చెందారు.
చాలా కాలం తర్వాత ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. మార్చి 21 నుంచి 23 వరకూ రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ ఆ చుట్టుపక్కల పరిసరాల్లో నేడు కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.