ఆంధ్రప్రదేశ్ కు వాయు "గండం"... ఆ మూడు రోజులు యమగండమే | AP Weather Latest Update | RTV
ఏపీలో ఈ నెల 23వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఏపీలో ఈ నెల 23వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి ఆర్.పి.సిసోడియా తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఎండలు , ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు మరో మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని , ఏపీలోని ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మరికాసేపట్లో విశాఖపట్నంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మోస్తరు నుంచి భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వర్షం పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించారు అధికారులు.