AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకి అతి భారీ వర్షాలు! ఏపీలో ఈ నెల 23వ తేదీన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. By Bhavana 22 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Ap Rains: ఏపీలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ వెల్లడించింది. హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రం పై ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.మృత్సకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు కూడా వర్షం సమయంలో పొలాల్లో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. Also Read: TG:తాగినోళ్లకు తాగినంత...మందుబాబులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే ఆఫర్! ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫాన్‌గా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. Also Read: RBI: ఐదు బ్యాంకుల మీద కొరడా ఝళిపించిన ఆర్బీఐ..భారీ జరిమానా ఈ అల్పపీడనం ఈ నెల 26 లేదా 27నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా వస్తుందని అధికారులు అంటున్నారు. ఈ ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ సమయంలో ఎవరూ బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. Also Read: రేవంత్ ప్రభుత్వానికి షాక్..సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ చలి పంజా కూడా.. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా కూడా విసురుతోంది. గతంలో కంటే ఇప్పుడు చలి తీవ్రత కూడా పెరిగింది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో అయితే సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉదయం 10 గంటల వరకు చాలా ప్రాంతాల్లో పొగ మంచు కప్పేస్తోంది. పొగమంచు కారణంగా రహదారులపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. Also Read: Gautam Adani: అదానీకి వరుసగా షాక్‌లు..కెన్యా ఒప్పందాలు రద్దు #ap-weather-forecast #ap-weather-update #ap-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి