ఏపీ అవతరణ వేడుకలపై వివాదం.. చంద్రబాబు కీలక ప్రకటన!
నవంబర్1 అంటే అందరికీ రాష్ట్ర అవతరణ గుర్తుకు వస్తుందని అన్నారు. 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన త్యాగాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని తెలిపారు.
ఆరు కోట్ల ఆంధ్రులను అవమానించారు.. బాబు, కళ్యాణ్‌పై రోజా షాకింగ్ ట్వీట్
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ మాజీమంత్రి రోజా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించరా? అని ప్రశ్నించారు. మీరసలు పాలకులేనా?.. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అవతరించిందని అడిగితే భావితరాలకు ఏం సమాధానం చెప్తారు? అంటూ ట్వీట్ చేశారు.
ఏపీకి వెళ్లిన ఐఏఎస్‌లకు కీలక పోస్టింగ్‌లు.. ఆమ్రపాలికి ఏదంటే?
ఏపీకి వెళ్లిన ఐదుగురు ఐఏఎస్‌లకు ప్రభుత్వం కీలక పోస్టింగ్‌లు కేటాయించింది. టూరిజం శాఖ ఎండీగా ఆమ్రపాలి, వైద్యారోగ్య శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణి మోహన్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌కు పోస్టింగ్ ఇచ్చింది.
Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో షాక్.. ఇప్పుడెలా..!
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అక్టోబర్ 29 నుంచి బుకింగ్ మొదలుకానుంది. ఈ గ్యాస్ బుకింగ్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారుల తెల్ల రేషన్‌కార్డుల సమాచారం ఉంటే కానీ బుకింగ్ వీలుకాని పరిస్థితి ఏర్పడింది. దీనిపై అధికారుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.