ఏపీ అవతరణ వేడుకలపై వివాదం.. చంద్రబాబు కీలక ప్రకటన!

నవంబర్1 అంటే అందరికీ రాష్ట్ర అవతరణ గుర్తుకు వస్తుందని అన్నారు. 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన త్యాగాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని తెలిపారు.

New Update
Chandrababu

నేడు అంటే నవంబర్ 1వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిన రోజు. అలాంటి రోజును సీఎం చంద్రబాబు మరిచారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు.  నవంబర్1 అంటే అందరికీ రాష్ట్ర అవతరణ గుర్తుకు వస్తుందని అన్నారు.

ఇది కూడా చదవండి: మేమంతా ఒకే పిడికిలి.. రిటెన్షన్‌ పై హార్దిక్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మొన్నటికి మొన్న క్యాబినెట్‌లో ఈ విషయంపైనే చర్చించామని అన్నారు. 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేసింది తాను అని గుర్తుచేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. 

ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేసింది నేను

‘‘నవంబర్ 1 అంటే అందరికీ రాష్ట్ర అవతరణ గుర్తుకు వస్తుంది. మేం మొన్న క్యాబినెట్ లో దీనిపై చర్చించాం. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రాణ త్యాగంతో రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేసింది నేను అని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. 1952 అక్టోబర్ 19 ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఆ పోరాటంలో డిసెంబర్ 15వ తేదీన ఆయన ప్రాణాలు విడిచారు. దాదాపు 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు. 

 

ఆయన మృతితో ఉద్యమం పుడితే తరువాత అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ప్రకటించారు. 1956లో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేశారు. 2014లో జూన్ 2 ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఇవన్నీ మొన్న క్యాబినెట్‌లో చర్చించాం. ఒక్కో రోజున ఒక్కో పరిణామం జరిగింది. అయితే పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణం చేసిన రోజును ప్రత్యేక రోజుగా గుర్తించి నిర్వహించేందుకు మేం నిర్ణయం తీసుకున్నాం.

ఇది కూడా చదవండి: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన!

ఆయన త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం

పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన డిసెంబర్ 15వ తేదీ చరిత్రలో ముఖ్యమైన రోజు. ఆయన ప్రాణ త్యాగం చేసిన రోజును, ఆయన త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఆయనను గౌరవించుకుంటాం. ఏపి విషయంలో చరిత్రలో అనేక మార్పులు జరిగాయి. అయితే చరిత్ర గుర్తుపెట్టుకుంటూనే చరిత్ర సృష్టించిన త్యాగధనులను గౌరవిస్తాం. ఈ విషయంలో ఎప్పుడూ ముందు ఉంటాం’’ అని చెప్పుకొచ్చారు. 

వైసీపీ నేత రోజా ఫైర్ 

ఇది కూడా చదవండి: సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే

ఆరు కోట్ల ఆంధ్రులను, ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు అవమానించారన్నారు. తెలంగాణకు అవతరణ దినం ఉంది, అలాగే కర్నాటక, తమిళనాడు, ఒడిశాకు అవతరణ దినం ఉంది.. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం వలన ఆంధ్రప్రదేశ్‌కి అవతరణ దినం లేకుండా పోయిందని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని చంద్రబాబు ప్రభుత్వం కనీసం జరపలేని స్థితిలో ఉందని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కూడా అవతరణ దినోత్సవం నిర్వహణ రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌.. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని అవహేళన చేసేలా నిర్ణయించడం దారుణమని అన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు