డిప్యూటీ కలెక్టర్ పీవీ సింధు.. ఆన్‌డ్యూటీ మరో ఏడాది పొడిగింపు
ఏపీ ప్రభుత్వం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆన్‌డ్యూటీ సదుపాయాన్ని మరో ఏడాది పొడిగించింది. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న పీవీ సింధు ఆన్‌డ్యూటీ సౌకర్యం 2025 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.