చంద్రబాబు ప్లాన్ అదుర్స్..ఏపీకి నెదర్లాండ్స్ సిస్టమ్, వాటికి చెక్!

రాష్ట్రంలో వరద సమస్యను ఎదుర్కోవడానికి చంద్రబాబు సర్కార్ నెదర్లాండ్స్ గ్రావిటీ కెనాల్ సిస్టమ్‌ ను తీసుకురానుంది. ఇందుకోసం అమరావతిలోని పలు ప్రాంతాల్లో 217 కి.మీ మేర రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. వరదల సమయంలో నీటిని బయటకు పంపడానికి ఇది వీలు కల్పిస్తుంది.

New Update
chandrababu,,

రాష్ట్రంలో ఇటీవల వారానికి పైగా కురిసిన భారీ వర్షానికి రాజధాని అమరావతి అతలాకుతలం అయింది. దీని కారణంగా బుడమేరు వాగు కట్ట తెగి పొంగిపొర్లింది. దీంతో విజయవాడలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. మరెన్నో జీవులు నీటిలో కొట్టుకుపోయాయి. తిండి తిప్పలు లేక ఎందరో విలవిలలాడారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల సమయంలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా సీఎం చంద్రబాబు నాయుడు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. 

Also Read :  అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి సోమవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో వరద సమస్యను ఎదుర్కోవడానికి నెదర్లాండ్స్ గ్రావిటీ కెనాల్ సిస్టమ్‌ (Gravity Canal System)ను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో రింగురోడ్డు నిర్మాణం, రిజర్వాయర్ వ్యవస్థ వినియోగం వంటి ప్రాజెక్టుల కోసం సీఎం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది.

Also Read :  క్షమాపణ చెప్పాకే రావాలి.. రాహుల్: KTR

ఈ మేరకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ (ఎంఏయూడీ) మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ.. అమరావతికి రూ.15,000 కోట్లు విడుదల చేసేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించిందని.. కావున వరద నివారణ ప్రణాళికలను వీలైనంత త్వరగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా సెప్టెంబరులో విజయవాడకు వరదలు రావడంతో రాజధాని ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి ఏర్పడిందని.. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతపై సమస్యను పరిష్కరించాలన్నారు.

పలు ప్రాంతాల్లో రిజర్వాయర్లు

Also Read :  ఛీ..ఛీ.. స్కూల్‌లోనే టీచర్ పాడు పని!

ఇందులో భాగంగానే అమరావతిలోని పలు ప్రాంతాల్లో 217 కి.మీ మేర రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు. అందులో రాజధాని ప్రాంతంలోని కొండవీటి, పాలవాగు వద్ద గ్రావిటీ కెనాల్‌ రిజర్వాయర్లు, నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరు, వుండవల్లిలో స్టోరేజీ రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. కాగా ఈ గ్రావిటీ కెనాల్ సిస్టమ్ అనేది నెదర్లాండ్ లో ఉపయోగించబడుతుంది. ఈ సిస్టమ్ ద్వారా నదులు లేదా కాలువల నుండి నీటిని పొలాలు, జలాశయాలకు మళ్లించడానికి గ్రావిటీ ఉపయోగించబడుతుంది. 

Also Read :  హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..!

గ్రావిటీ కెనాల్ సిస్టమ్?

గ్రావిటీ కెనాల్ సిస్టమ్ అనేది ప్రాథమికంగా గురుత్వాకర్షణ సూత్రంపై ఆధారపడిన డ్రైనేజీ, నీటిపారుదల వ్యవస్థ. ఈ విధానంలో కాలువల ద్వారా గురుత్వాకర్షణ శక్తితో నీటిని ఒక చోట నుండి మరొక చోటకి రవాణా చేస్తారు. ఇది ప్రధానంగా నీటిపారుదల కోసం ఉపయోగించబడుతుంది. ఈ వ్యవస్థలో నీరును ఎత్తైన ప్రదేశం నుండి దిగువ ప్రదేశానికి మల్లిస్తారు. వీటిలో కాలువలు, చానెల్స్ ఉపయోగిస్తారు. అయితే ఇందులో చానెళ్లు పొలాలకు మాత్రమే నీటిని అందించడానికి ఉపయోగపడతాయి. 

ఇక గ్రావిటీ కెనాల్ సిస్టమ్ ను గంగా కెనాల్, ఇంద్రప్రస్థ కెనాల్ మొదలైన భారతదేశంలోని అనేక నీటిపారుదల ప్రాజెక్టులలో ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా ఈ కాల్వలు రైతులకు సాగునీరు అందించేందుకు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. 

వరదలను ఎలా నివారిస్తాయి?

అయితే గ్రావిటీ కెనాల్ సిస్టమ్ అనేది కొంత వరకు సహాయపడుతుంది. ప్రధానంగా ఈ గ్రావిటీ కెనాల్ సిస్టమ్ అనేది నీటిపారుదల కోసం రూపొందించబడింది. దీని ద్వారా నదులు లేదా జలాశయాల నుండి నీటిని నియంత్రిత ప్రదేశాలకు మల్లిస్తారు. ముఖ్యంగా వరదల సమయంలో నీటి స్థాయిలు పెరిగినపుడు ఆ వరద నీటిని లోతట్టు ప్రాంతాల నుండి బయటకు పంపడానికి వీలు కల్పిస్తుంది. దీని వల్ల లోతట్టు ప్రాంతాలు సేఫ్ గా ఉంటాయి. దీని ద్వారా వరద ప్రభావాన్ని నివారించవచ్చు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు