Sreeleela: సెట్స్ లో ఎవరూ లేని సమయంలో శ్రీలీల ఆయనను అలా పిలుస్తుందట..!!
హీరోయిన్ శ్రీలీలతో తనకున్న బంధుత్వం గురించి చెప్పుకొచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. శ్రీలీల అమ్మ, తన అమ్మమ్మది ఒకే ఊరు అని తెలిపారు. శ్రీలీల అమ్మ తనకు అక్క అవుతుందని వెల్లడించారు. మరోవైపు సెట్స్ లో అనిల్ ను డైరెక్టర్ గారూ అని పిలిచే శ్రీలీల.. ఎవరూ లేని సమయంలో మామయ్యా అని పిలుస్తుందట. అనిల్ తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' చిత్రంలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ విషయాలు తెలిపారు.