Director Anil Ravipudi: టాలీవుడ్ యంగ్ హీరో అశ్విన్ బాబు, దివంగన జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శివం భజే’.. అప్సర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ (Shivam Bhaje Trailer) రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో విశ్వక్ సేన్’ సంగీత దర్శకుడు తమన్ ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.
టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపే క్రమంలో అనిల్.. దిగంగనను ఉద్దేశిస్తూ మాట్లాడుతుండగా అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. దీంతో, ‘హీరోయిన్ల గురించి మాట్లాడకూడదా?’ అని నవ్వుతూ ప్రశ్నించారు అనిల్. తాను నటించే ప్రతీ సినిమా గురించి అశ్విన్ చెబుతుంటాడని, అతడు సోదరుడి లాంటివాడని తెలిపారు. విశ్వక్, తమన్ లతో కలిసి వేదిక పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.
Anil Ravipudi : హీరోయిన్ల గురించి మాట్లాడొద్దా?: అనిల్ రావిపూడి సంచలన కామెంట్స్!
డైరెక్టర్ అనిల్ రావిపూడి 'శివం భజే' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపే క్రమంలో హీరోయిన్ దిగంగనను ఉద్దేశిస్తూ మాట్లాడుతుండగా అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. దీంతో, ‘హీరోయిన్ల గురించి మాట్లాడకూడదా?’ అని నవ్వుతూ ప్రశ్నించారు.
Translate this News: