బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ సీజన్ 4' ఆహాలో భారీ వ్యూస్ రాబడుతోన్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో ఇప్పటికే పలు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవ్వగా.. వాటిలో అల్లు అర్జున్ ఎపిసోడ్ మాత్రం మిలియన్ వ్యూస్ తో రికార్డు సాధించింది. ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా విచ్చేసి ఎన్నో విషయాలు బాలయ్యతో పంచుకున్నారు. బాలయ్య షోలో వెంకీమామ.. ఇక బన్నీ తర్వాత రీసెంట్ గా నవీన్ పోలిశెట్టి, శ్రీలీల నవ్వులు పూయించారు. ఇక నెక్ట్స్ ఎపిసోడ్ లో మాత్రం ఓ సీనియర్ స్టార్ హీరో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు మన వెంకీమామ అని సమాచారం. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాలో నటిస్తున్నాడు. #UnstoppableWithNBK 🤩22 న @VenkyMama @AnilRavipudi — Saketh సంక్రాంతి కి వస్తున్నాం #Venky76 🔥 (@VenkySaketh143) December 19, 2024 ఇది కూడా చదవండి: BIG BREAKING: కేటీఆర్ పై ఏసీబీ కేసు.. ఏ క్షణమైనా అరెస్ట్? జనవరి 14 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా వెంకీ అన్ స్టాపబుల్ సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు.ఆయనతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా హాజరు కానున్నారట. వీళ్ళిద్దరూ ఈ ఎపిసోడ్ లో బాలయ్య తో కలిసి 'సంక్రాంతికి వస్తున్నాం' విశేషాలు పంచుకోబోతున్నారట. VENKATESH AND ANIL RAVIPUDI SET TO GO TO UNSTOPPBLE SHOW ON DEC 22.As we know venkatesh movie "sankratiki vastunnam" set to pongal .Balyya with venkatesh, old memories will back 🥰.@VenkyMama @AnilRavipudi#UnstoppableWithNBK #MaheshBabu pic.twitter.com/GwOhVrggpm — NewsBuzz (@fresh__focus) December 19, 2024 ఈ ఎపిసోడ్ ను ఈ నెల 22న షూట్ చేయనున్నట్లు సమాచారం. బాలయ్య, వెంకీ ఇద్దరూ కలిస్తే ఆ హంగామానే వేరు. అలాంటిది వాళ్ళిద్దరికి అనిల్ రావిపూడి తోడైతే నెక్స్ట్ లెవెల్ ఫన్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఈ వారమే ఈ ఎపిసోడ్ ప్రోమో కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. Also Read: రణ్ బీర్ తో అలాంటి ఫోటోలో కనిపించిన పాకిస్థాన్ బ్యూటీ.. తర్వాత పాపం ఆమె జీవితం....